Monday 28 December 2015

జీలకర్ర (Cumin)

cumin (జీలకర్ర)

  • వాంతులు:- తేనె 20 గ్రాములు, దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3 గ్రాములు  కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 నుండి 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.
  • ఉబ్బురోగం:- జీలకర్రను నీటిలో తడిపి, తర్వాత దాన్ని నూరి రసం తీసి ప్రతి 8 గంటలకోసారి తాగితే ఉబ్బురోగం తగ్గిపోతుంది.
  • కడుపు నొప్పి:- ఒక అర చెంచా జీలకర్ర లేదా వాము బాగా నమిలి మింగితే కాసేపటికి కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • జలుబు:- రెండు కప్పుల నీటిలో కొద్దిగా జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి మరిగించి ఆ కషాయం తాగితే జలుబు నుండి త్వరగా ఉపసమనం పొందే వీలుంటుంది.
  • అరికాళ్ళ మంటలు:-  సోంపు - 50 గ్రా., జీలకర్ర - 50 గ్రా., ధనియాలు - 50గ్రా. ఈ మూడింటిని చూర్ణం చేసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు మరుగుచున్న నీటిలో వేసి ఒక పొంగు వచ్చేవరకు కాచి వడబోయాలి. వడబోసిన నీటిని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి త్రాగవలెను. ఇలా రోజు ఉదయం, రాత్రి తీసుకుంటే అరికాల్లమంటలు తగ్గిపోయే అవకాశం చాలా ఉంది.



శరీర దుర్వాసన (Body Odour)


Body Odour (శరీర దుర్వాసన)

  • నల్ల ఉలవల పొడి  100 గ్రాములు, మెంతుల పొడి 100 గ్రాములు, కస్తూరి పసుపు పొడి 100 గ్రాములు, బావంచాల పొడి 100 గ్రాములు, కరక్కాయల బెరడు పొడి 100 గ్రాములు, కచ్చూరాల పొడి 100 గ్రాములు
తయారు చేయు విధానం: పైన తెలిపిన అన్ని పొడులను కలిపి ఒక డబ్బాలో తీసి పెట్టుకోవాలి. మిశ్రమం చేసిన పొడిలో కొంచెం నువ్వుల నూనె కాని, పాలు కాని కలిపి ప్రతి రోజు స్నానానికి అరగంట ముందు మీ చర్మానికి పూసుకొని తరువాత స్నానం చేయాలి. ఇలా 30 రోజులు చేస్తే మీ శరీర దుర్వాసన మటుమాయం అవుతుంది.

మొటిమలు (PIMPLES)

Pimples (మొటిమలు)
  • రేగి పండు గింజలు పగులగొట్టి అందులోని పప్పును తీసుకుని పొడి చేసుకోవాలి. దానిలో తగినంత వెన్న , కొద్దిగ తేనె కలిపి మెత్తగ నూరి మొటిమల మీద, మొటిమల వల్ల కలిగిన మచ్చల మీద వ్రాయాలి,ఎండి పోయాక గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా 40 రోజులు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
  • దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును మొటిమలు ఉన్నచోట పూయటం వలన మొటిమలు తగ్గిపోయి మచ్చలు కూడా రాకుండా చేస్తుంది.

కీళ్ళ నొప్పి (Joint Pain)

Joint Pain (కీళ్ళ నొప్పి)


  • కరక్కాయ పొడి, శొంఠిపొడి, వామును వేయించి చేసిన పొడి ఒక్కొక్కటి 5౦గ్రాములు మరియు 15౦ గ్రాములు బెల్లం అన్ని కలిపి దంచి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ నిల్వ ఉంచిన పొడిని ఉదయం మరియు సాయత్రం పూటకు గచ్చకాయంత పరిమాణంలో చప్పరించి మింగాలి. తర్వాత 1౦౦ మి.లీ.ల గోరువెచ్చని నీరు లేదా పాలు త్రాగాలి. రోజూ ఈ విధంగా చేయడం వలన కీళ్ళనొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
కావలసిన పదార్థాలు:- ఆముదము చెట్టు వేర్లు 1 కిలో, ఆముదము 5౦౦ గ్రా., నీరు 4 రెట్లు.

చేసె విధానం: ఆముదం తోలు 5౦౦ గ్రా. ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు అనగా 2 కి.గ్రా. వేయాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి, వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు, ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగా కలిపి, చల్లార్చి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించే విధానం: దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ మర్ధన చేసి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండిలో వేయించి, దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి. 

Wednesday 16 December 2015

దాల్చిన చెక్క (Cinnamon) (दालचीनी)


Cinnamon (దాల్చిన చెక్క)

  • 2 గ్రాములు దాల్చిన చెక్క, 1 గ్రాము యాలిక గింజలు, కొద్దిగా శొంటి పొడి, 2 గ్రాముల  తాటి కలకండ వేసి అందులో కొద్దిగా నీరు పోసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి.ఈ కషాయాన్ని సేవించడం వలన ఉదర సంబంధ వ్యాధులు తగ్గి పోతాయి.
  •  అరస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వలన హృదయ నాళాల్లో కలిగే బ్లాక్స్ (Coronary artery disease) ను తొలగిస్తుంది. 
  • దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును మొటిమలు ఉన్నచోట పూయటం వలన మొటిమలు తగ్గిపోయి మచ్చలు కూడా రాకుండా చేస్తుంది.
  • దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును కీళ్ళనొప్పులు (Arthritis) ఉన్నచోట పూతగా వాడటం వలన కీలనొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

Tuesday 15 December 2015

ఉదర సంబంధమైన వ్యాధులు

Stomach Pain (కడుపు నొప్పి)

  • శొంటిని నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. ఒక కప్పు శొంటి చూర్ణానికి నాలుగు కప్పుల నేతిని, పదహారు కప్పుల నీటిని కలిపి నీళ్లన్నీ ఆవిరై పోయి నెయ్యి మాత్రం మిగిలే వరకూ కాచాలి. దీనిని దించి వడగట్టి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజూ రెండు పూటలా ఒక చెంచా చొప్పున పంచదార కలుపుకొని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వలన తరచుగా విరేనాలు కావడం, కామెర్లు, రక్తక్షీనత, కడుపునొప్పి, అజీర్తి వంటి ఉదర సంబంధ వ్యాధులు నివారింపబడతాయి.

Monday 14 December 2015

అరటి (Banana)

అరటి (Banana )

  • లేతగా ఉన్న అరటికాయను చిన్న చక్రాలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా పొడి చెయాలి. ఈ పొడిని బెల్లం పాకం లేదా తేనెతో కలిపి తీసుకుంటుంటే జిగురు విరేచనాలు ఆగిపొతాయి. 
  • ముదిరిన అరటి కాయను చక్రాలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా పొడి చెయాలి. ఈ పొడిని రోజూ సేవించడం వలన హెర్నియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది . 
  • కూర అరటికాయను చిన్న చిన్న చక్రాలుగా కోసి ఎండబెట్టి మెత్తగా పొడిచేయాలి . ఈ పొడిని రోజూ తీసుకోవడం వలన స్త్రీలలో తెల్లబట్ట వ్యాధికి చక్కగా పనిచేస్తుంది .  అలాగే గర్భ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి . 
  • అరటి ఆకులలో భోజనం చేయడం వలన మూత్ర సంబంధ వ్యాధులు, రక్తపోటు (B.P.), మధుమేహం (Sugar) క్రమంగా తగ్గుముఖం పడతాయి . అరటి ఆకులో భోజనం చేయడం వలన మూత్ర పిండాలలో రాళ్ళు ఉన్న వారికి మరియు మూత్ర పిండ సంబంధ వ్యాధులు ఉన్నవారికి చాలా ఉపయుక్తం.  

చనుల వాపు (Breast Swelling)


  • నల్ల ఉమ్మెత్త ఆకులను వేడిచేసి పట్టువేసి కట్టినట్లయితే చనులవాపు తగ్గే అవకాశం ఉంది.
  • ప్రతి పూట మూడు నీరుల్లి రెబ్బలను నమిలి మింగాలి. దీనితో పాటు చనులకు వేడినీటి కాపడం పెడుతుండాలి.

Friday 11 December 2015

తాంబూలం (PAN) కిళ్ళీ

తాంబూలం (PAAN)
ఆహారము సేవించిన తరువాత తాంబూలము సేవించుట మంచిది ,ఆరోగ్యకరమైనది.తాంబూలము సేవించినట్లయితే, మనము తీసుకున్న ఆహారమునందలి విష పదార్ధములను నిర్వీర్యము చేయును.
తాంబూలము సేవించుట వలన జీర్ణ శక్తి అభివృద్ధి పరచును, దంత పుష్టి కలుగును. ఎప్పటికి చెడుపు కలుగనీయదు. తాంబూలము నోటికి చురుకుదనము, సువాసనను ఇచ్చును, ముఖమునకు కాంతిని కలిగిస్తుంది. స్వరాపేటిక, నాలిక, దంతముల యందు మలినము పోగొట్టును. అధికముగా నోటి యందు ఉమ్మి  రావటాన్ని తగ్గించును.
హృదయమునకు మేలు చేయును. ఉష్ణమును కలుగ చేయును. కారము, చేదు, ఉప్పు, వగరు రసములను కలిగి యుండుటచే మలబద్దకమును పోగొట్టును.
సంబోగమునందు ఆసక్తి కల్గించును. కొన్ని సమయములందు పిత్తమును వృద్ధి చేయును. ఆరోగ్యజీవితము, ధారనా శక్తి,  జ్ఞాపక శక్తి, బుద్ధి, ఆకలి కలిగించును.

Thursday 3 December 2015

పసుపు (Turmeric)

పసుపు (Turmeric)

మధుమేహం:- మంచి పసుపు, ఉసిరిక కాయ బెరడు చూర్ణము ఈ రెండూ సమభాగాలు కలిపి చూర్ణం చేసి రోజు 2 పూటలా 10 గ్రాములు మోతాదుగా మంచి నీళ్ళతో సేవిస్తూ వుంటే క్రమంగా మధుమేహం తగ్గుముఖం పడుతుంది.

కాలి పగుళ్ళు:- మనదరికి తెలుసు ఏ శుభకార్యం  అయినా ఆడవారు కాళ్ళకు పసుపు పట్టించుకుంటుంటారు. కాళ్ళకు పసుపు పట్టించుకోవడం  వలన  కాళ్ళ పగుళ్ళకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. కాళ్ళను శుభ్రంగా నీటితో కడిగి పొడి బట్టతో తుడిచి  పసుపు మరియు ఆముదం కలిపి పట్టించడం వల్ల కాలి పగుళ్ళు మటుమాయం అవుతాయి.

నేత్ర వ్యాధులు:- పరిశుభ్రమైన పసుపు కొమ్మును నీటితో సాది ఆ గంధాన్ని పెసర బద్ధంత మోతాదుగా కలిములాగా రోజు రాత్రి పూట వాడుతూ వుంటే నేత్ర వ్యాధులు హరిస్తాయి.




గడ్డలు, గాయాలు, బెనుకులు:- పసుపు గాని, పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు, గడ్డలు, గాయాలు, బెనుకులు హరించి పోతాయి.

తల రోగములు:- పసుపు కొమ్మును గంధం తీసి పైన లేపనం చేసిన లేక పైన పట్టు లాగా వేసిన దాని మీద కాపడం పెట్టిన తలదిమ్ము, తల పోట్లు, పార్శ్వపు నొప్పి,  అపస్మారము శాంతిస్తాయి. పసుపు పూల రసం గాని ఆకుల రసం గాని వాడిన అదే ఫలితం కలుగుతుంది.


గోరుచుట్టు - మడమశీల:-  పసుపును సున్నపు నీటిలో ఉడక బెట్టి గాని లేక నూనెలో వుడకపెట్టి కాని పైన వేసి కడుతూ వుంటే గోరు చుట్టు, మడమ శూల, జెట్టలు, గడ్డలు  మొదలైనవి హరించి పోతాయి.


పురుగులకు:- పసుపు చూర్ణం నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లితే పురుగులు నశించిపోతాయి.


స్పోటకం మచ్చలు :-  పసుపు, వేపాకు కలిపి ముద్దగా నూరి నూనె కలిపి వంటికి లేపనం చేస్తూ వుంటే స్పోటకం తాలుకు మచ్చలు, పుండ్లు మానిపోతాయి. ఇదే ప్రక్రియ ప్రకారం అనేక చర్మ వ్యాధులను సైతం అరికట్టవచ్చు.


దగ్గులు - పిల్లికూతలు:- వగర్పు దగ్గులు ,పిల్లి కూతలు మొదలైన శ్వాస కోశ వ్యాధులున్నవారు పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి చల్లార్చిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరించి దాని రసం మింగుతూ వుంటే దగ్గు ,పిల్లి కూతలు తగ్గుతాయి.

కనురెప్పలు రాలటం:-  నిమ్మపండుకు రంధ్రం చేసి అందులో పసుపు కొమ్మును దూర్చి 3 రోజులు నానబెట్టాలి. తరువాత దాన్ని తీసి ఎండబెట్టాలి. మళ్ళీ వేరొక నిమ్మపండులో దాన్ని గుచ్చి 3 రోజులుంచి తీసి ఎండబెట్టాలి. ఇలా చేసిన తరువాత బాగా ఎండిన ఆ పసుపు కొమ్మును నిలవ చేసుకుని రోజు రాత్రి నిద్ర పోయే ముందు కొంచెం నీటితో సాది ఆ గంధాన్ని కంటికి కాటుక లాగ పెట్టు కొంటూ వుంటే కంటి రెప్పలు ఊడిపోవడం ఆగిపోతుంది.

జలుబు, ముక్కు దిబ్బడ:- జలుబు అందరికి సాధారణంగా వేధించే సమస్య. దీని నివారణకు కూడా పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. నిప్పులపై పసుపు వేసి ఆ పొగను వాసన చూసినట్లయితే జలుబుకు చక్కని ప్రయోజనం ఉంటుంది. ఈ కాలంలో నిప్పులు లభించుట కష్టం కావున వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి అయినా పట్టుకోవచ్చు.

తేనె (Honey)

Ayurvedam
 తేనె (Honey)
కంటి మసకలకు:-  1.ఎండు కర్జూరము కాయ లోపలి గింజను మంచి తేనె తో సానరాయి మీద అరగదీసి ఆ గంధాన్ని పెసర గింజంత కంట్లో పెట్టుకొంటూ వుంటే కంటి మసకలు నివారింపబడతాయి .

2. మంచి మేలు రకమైన పట్టు తేనె 4 చెంచాలు ,మంచి మేలు రకమైన పచ్చ కర్పూరము 2 చిన్న పలుకులు కలిపి మెత్తగా నూరి గాజు బరిణి లో నిలువ ఉంచుకుని ,రాత్రి పూట కండ్లలో పెసర బద్ధంత పెట్టుకొంటూ వుంటే ,కండ్లలో కొంచెం నీరు కారిపోయి, కండ్లు తేటగా చల్లగా మారి, మసకలు కంటి దురదలు కూడా తగ్గిపోతాయి.

నేత్ర బలం:- రాత్రి నిద్ర పోయే ముందు తేనె (Honey), నీరుల్లి (Onion) రసం సమంగా కలిపి 2 చుక్కలు కంట్లో వేసుకొంటూ వుంటే నేత్ర దోషాలు నివారింపబడతాయి.


జలుబు-పడిశము:- రోజు 2 లేక 3 పూటలా అవసరాన్ని బట్టి 30 గ్రాముల  తేనె 25 గ్రాముల అల్లం రసం కలిపి తాగుతూ వుంటే జలుబు ,పడిశము 2 రోజుల్లోనే హరించి పోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.మలబద్ధకం కూడా నివారింపబడుతుంది .

శరీర స్థౌల్యము (స్థూలకాయము) తగ్గుటకు:- ప్రతి రోజు ఉదయం పరగడపున 20 గ్రాముల  తేనెను రాత్రి నిలువ వున్న నీటిలో కలిపి తాగుతూ వుంటే క్రమంగా శరీర స్థౌల్యము  తగ్గిపోతుంది.

బిళ్లలకు-గడ్దలకు:-  తేనె ,సున్నము ఈ రెండు సమంగా కలిపి నూరి శరీరం మీద లేచే బిళ్లలకు గాని, గడ్దలకు గాని పట్టు లాగ వేసి పైన పలుచటి నూలుగుడ్డ అంటిస్తూ వుంటే అవి కరిగిపోతాయి.

వాంతులు:- తేనె 20 గ్రాములు, దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3 గ్రాములు  కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 నుండి 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.

స్త్రీల ఎర్రబట్టకు:-  2౦ గ్రాముల తేనె , 1౦ గ్రాముల ఉసిరికాయ బెరడు చూర్ణము  కలిపి ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే స్త్రీల ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.


కాళ్ళ పగుళ్ళకు:- తేనె మైనం 50 గ్రాములు, తీసుకుని చిన్న మంట మీద మరిగించి వడపోసి అందులో 100 గ్రాముల వెన్నపూస కలిపితే అది కూడా కరిగిపోయి, ఆ తరువాత ఆ రెండు పదార్ధాలు పేస్ట్ లాగ మారతాయి. ఆ పదార్ధాన్ని పాదాల పగుళ్ళకు లేపనం చేస్తూ వుంటే పగుళ్ళు తగ్గిపోయి పాదాలు నున్నగా అవుతాయి.

కంట్లో పువ్వులకు:- తేనె, లేత మునగాకు రసం సమభాగంగా కలిపి రోజు రాత్రి నిద్ర పోయే ముందు 2 చుక్కలు కంట్లో వేస్తూ వుంటే కంటి లోని పువ్వులు కరిగి పోతాయి.

నీరసం రోగం:- రోజు 2 పూటల అర గ్లాస్ మంచి నీళ్ళల్లో 30 గ్రాముల తేనె కలిపి తాగుతూ వుంటే నీరసం రోగం తగ్గిపోయి వంటికి మంచి బలం వస్తుంది.

మూత్రం కష్టంగా వస్తుంటే:- తేనె 15౦ గ్రాములు, మంచి మేలు జాతి పసుపు 50 గ్రాములు, కలిపి బాగా మెత్తగా నూరి నిలువ ఉంచుకుని రోజు 2 పూటల పూటకు 15 గ్రాముల మోతాదుగా సేవించి వెంటనే ఆవు పాలు తాగుతూ వుంటే మూత్రం బొట్టుబొట్టులా పడటం హరించి సాఫీగా వెలువడుతుంది.

దగ్గు:- తేనె 3 గ్రాములు, అల్లం రసం 6 గ్రాములు కలిపి ఒక మోతాదుగా, 2 పూటలా సేవిస్తూ వుంటే దగ్గు తగ్గిపోతుంది.

పిల్లల ఉదర పోటు:-  ప్రతి రోజు ఉదయం పరగడపున పావు గ్లాస్ నీళ్ళల్లో పావు చెంచా తేనె కలిపి తాగిస్తూ వుంటే పిల్లల గాలి పొట్ట కరిగిపోతుంది.

పిల్లల చిగుళ్ళ వాపు:-
పిల్లలకు దంతాలు వచ్చే ముందు చిగుళ్ళు వాస్తే నిప్పుల మీద పొంగించిన వెలిగారము ,తేనె కలిపి మెత్తగా నూరి కొద్ది పరిమాణము చిగుళ్ళ మీద పట్టిస్తూ వుంటే ఆ వాపులు తగ్గిపోతాయి.

నోటి దుర్గంధం:- పావు లీటర్ మంచి నీళ్ళల్లో 10 గ్రాములు తేనె కలిపి, ఆ నీటిలో రోజు 3 పూటలా పుక్కిలించి వూసివేస్తూ వుంటే నోటి దుర్గంధం హరించి పోయి నోరు పరిమలంగా వుంటుంది.

అంటు వ్యాధులకు:- తేనె మైనమును నిప్పుల మీద వేసి ఆ పొగను ఇంట్లో ప్రసరింపచేస్తూ వుంటే అంటూ వ్యాధులు సోకకుండా నివారింపబడతాయి. అందుకే ప్రతి రోజు చేసే యజ్ఞం లో తేనె వాడాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

Saturday 7 March 2015

పార్శ్వపు నొప్పి (Migraine headache)



  • కుంకుడు కాయను నీటిలో బాగా అరగదీసి దాన్ని ముక్కు రంద్రాలలో కొంచెం వేస్తే పార్శ్వపు నొప్పి తగ్గిపోతుంది.
  • లేత కొత్తిమీర ఆకులను బాగా నూరి నుడురుకు పట్టువేస్తే త్వరగా నొప్పి లాగేస్తుంది.

Sunday 1 March 2015

బరువు పెరగడం ఎలా? How to Gain weight?


  • ఒక గ్లాసు వేడి పాలలో రెండు చెంచాల అశ్వగంధ పొడిని, ఒక చెంచా నెయ్యి కలిపి రోజుకు రెండు పూటలా ఒక నెల రోజులు త్రాగితే బరువు పెరుగుతారు.
  • రోజు ఒక మామిడి పండును మూడు పూటలా పాలు త్రాగిన తరువాత తింటే ఒక నెల రోజులలో మంచి ఫలితం ఉంటుంది.
  • ఆరు ఎండు అంజీరాలను, 30 గ్రాముల ఎండు ద్రాక్షను తీసుకొని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి మరుసటి రోజు తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది.

Sunday 8 February 2015

కురుపులు

  • కొబ్బరినూనెలో  పసుపు కొమ్మును అరగదీసి వచ్చిన గంధాన్ని పుల్ల మీద రాయాలి. 
  • హారతి కర్పూరాన్ని, కొబ్బరి నూనెలో కలిపి పుల్లమీద రాస్తూ ఉండాలి.
  • ఉప్పునీటిలో పలుచటి గుడ్డను తడిపి దాన్ని పుల్లమీద కట్టుకట్టాలి. ఆరిన తరువాత అదే ఉప్పునీటిలో గుడ్డను తడుపుడూ ఉండాలి . 

ఉబ్బసం


  • రోజూ మూడు మారేడు ఆకులను రెండు పూటలా నమిలి మింగుతూ ఉండాలి.
  • కేబేజీ రసం లేదా ముల్లంగి రసం పూటకు ఒక ఔన్సు చొప్పున తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గిపోతుంది.
  • దగ్గు ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడినీటిలో చెంచా తేనె కలుపుకొని తాగితే వెంటనే ఉపసమనం కలుగుతుంది.

Friday 6 February 2015

కండ్ల కలక

కండ్ల కలక


  •  నీరుల్లి పొరను కనురెప్పల మీదుంచి , అరగంటకో సారి దాన్ని రసాన్ని పిండాలి.
  • గంటకోసారి కళ్ళలో ఒక చుక్క తమలపాకు రసం వేయడం వల్ల కండ్ల కలకను నివారించవచ్చు. 
  • ఒక చెంచా తేనెను ఒక కప్పునీటిలో మరగబెట్టి , చల్లారిన తర్వాత అరగంటకో చుక్క కళ్ళలో వేస్తుండాలి. 

ఆనె కాయలు లేదా ఆనెలు (Corns)

  • రాత్రి పడుకునే ముందు ఒక నూలు బట్టను తడిపి ఆనె కాయల మీద ఉంచితే అది మెత్తబడి తగ్గిపోతాయి  
  • రాత్రి పడుకునే ముందు ఆవాలు, వెల్లుల్లి సమపాళ్ళలో  తీసుకుని నూరి ఆనె  కాయల మీద రాస్తుంటే ఆనె కాయలు మెత్తబడి తగ్గిపోతాయి .  
  • జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రోజూ ఆనె కాయలపై రుద్దుతూ ఉంటే ఆనె కాయలు తగ్గుతాయి.
  • ఆముదాన్ని గోరువెచ్చగా కాచి దానిని ఆనెల మీద మరియు అరికాలు మొత్తం మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో ఉంచాలి. ఇలా రోజూ చేయడం ద్వారా ఆనెలు తగ్గడానికి ఆస్కారం ఉంది. 
  • అతిమధురం ఒక చెంచా, నువ్వుల నూనె ఒక చెంచా, ఆముదం ఒక చెంచా మూడింటిని కలిపి పేస్టు లాగా చేసి ఆనెలపై పట్టిస్తూ ఉంటె ఆనెలు క్రమంగా తగ్గుతాయి.

అజీర్తి


  • అజీర్తి ఉన్నవారు రోజు ఉదయాన్నే రెండు చెంచాల అల్లపు రసం తీసుకుంటూ దీనితో పాటు లేత తులసి ఆకులు కొన్ని తీసుకుంటుంటే అజీర్తి నుండి ఉపసమనం కలుగుతుంది . 
  • అజీర్తి నివారణ కోసం వేరుశనగ, తేనె, ద్రాక్ష, ఖర్జూరము, బూడిద గుమ్మడి లలో దేనినో ఒకదానిని తీసుకుంటున్నా అజీర్తి తగ్గిపోతుంది . 

ఉబ్బురోగం


  • జీలకర్రను నీటిలో తడిపి, తర్వాత దాన్ని నూరి రసం తీసి ప్రతి 8 గంటలకోసారి తాగితే  తగ్గిపోతుంది.
  • ప్రతిరోజూ ఉదయం పచ్చి కాకరకాయ రసాన్ని ఒక కప్పు తాగుతూ వున్దాలి. దీనితోపాటు ప్రతి ఆరు గంటలకో సారి కొన్ని వెల్లుల్లి రేకులను నమిలి మింగితే తగ్గిపోతుంది . 

Tuesday 3 February 2015

కఫము


  • దానిమ్మ లేత ఆకులను మూడు పూటలా నమిలి మింగడం వల్ల ఖఫము తగ్గిపోతుంది.
  • ప్రతి ఆరు గంటలకు ఒక సారి కేబీజి ఆకు రసాన్ని గాని లేదా బచ్చలి ఆకు రసాన్ని గాని రెండు స్పూన్ల చొప్పున తీసుకొని దానితో పాటు ఒక ఉసిరికాయ తీసుకోవడం వలన ఖఫము తగ్గుతుంది.


జలుబు


  • వెల్లుల్లిని బాగా నలగగొట్టి గంటకోసారి బాగా వాసన పీలుస్తూ, అరగంటకు ఒక సారి కొన్ని వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగడం వలన జలుగు తగ్గుతుంది.
  • ఒక గ్లాసు బార్లీ నీళ్ళలో నిమ్మరసాన్ని కాస్త ఎక్కువగా పిండుకొని ఆరు గంటలకు ఒక సారి త్రాగితే గుండెల్లో మంట మరియు జలుబు తగ్గుతాయి.

ఎక్కిళ్ళు


  • శొంఠి లేదా కరక్కాయ పై పెచ్చు తీసివేసి పొడిచేసుకొని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకొంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
  • కొబ్బరిని బాగా దంచి పాలు పిండి త్రాగినా లేదా నిమ్మ బద్దను నిదానంగా చప్పరిస్తున్నా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

Sunday 1 February 2015

కడుపు ఉబ్బరం


  • అల్లపురసం లేదా శొంటి కషాయం ప్రతిపూట ఒక చెంచా తీసుకోవడం వలన కడుపులో ఉబ్బరం తగ్గిపోతుంది.
  • ఒక కప్పు వేడినీటిలో రెండు చెంచాల వెల్లుల్లి రసాన్ని కలిపి తాగినా ఫలితం కనిపిస్తుంది.

కడుపులో పుండు


  • పూటకోసారి వెల్లుల్లిపాయ రసం, ఆగాకర కాయ రసాన్ని ఒక కప్పు వేడినీటిలో కలిపి తీసుకోవడం వలన కడుపులో పుండు తగ్గిపోతుంది.
  • ముల్లంగి రసం లేదా కొబ్బరిపాలు పూటకో కప్పు త్రాగటం వల్లకడుపులో పుండు తగ్గిపోతుంది. కర్బూజా పండు తినడం వల్ల కూడా కడుపులో పుండు తగ్గిపోతుంది.
  • పూటకోసారి ఒక చెంచా అల్లపురాసాన్ని ఒక కప్పు వేడినీటిలో కలుపుకొని తీసుకోవాలి.

కడుపులో మంట


  • కర్బూజా పండు లేదా పుచ్చకాయ తింటే కడుపులో మంట తగ్గుతుంది.
  • ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే రెండు చెంచాల అల్లపు రసం లేదా శొంఠీ కషాయం తాగితే కడుపులో మంట తగ్గిపోతుంది.

కడుపు నొప్పి (Stomach Pain)


  • ఒక అర చెంచా జీలకర్ర లేదా వాము బాగా నమిలి మింగితే కాసేపటికి కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • పెసర గింజంత ఇంగువ మింగినా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • ఒక కప్పు వేడినీటిలో టీ స్పూన్ తేనెను కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • విరిగిన పాలలోని నీటిని ఒక కప్పు తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది.
  • నీరుల్లిపాయ ఒకటి తిన్నా కడుపు నొప్పి తగ్గిపోతుంది.

Saturday 31 January 2015

గ్యాస్ట్రిక్ ట్రబుల్ (గ్యాస్ ట్రబుల్) (Gastric Trouble)

  • మొదట 100 గ్రాములు వామును దోరగా వేయించి పిండికొట్టి జల్లించి పక్కన పెట్టుకోవాలి. తరువాత 100 గ్రాములు పటిక బెల్లం నూరి పొడి చేసుకోవాలి. తరువాత 100 గ్రాములు ఆవు నెయ్యిని కరిగించి అందులో పొడిచేసిన వామును మరియు పటిక బెల్లం పొడిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలు లేకుండా కలియబెట్టాలి. తరువాత దీనిని చల్లారిస్తే చిక్కటి లేహ్యం తయారవుతుంది. దీనిని శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకొని రోజూ భోజనానికి గంట ముందుగాని లేదా భోజనానికి తరువాత గాని సేవిస్తే కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది.
  • ఒక గ్రాము అల్లం తీసుకొని దాన్ని చిటికెడు ఉప్పుతో కలిపి రోజు రెండు పూటలా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.
  • వాము నాలుగు భాగాలు, శోంటి రెండు భాగాలు, నల్ల ఉప్పు ఒక భాగం, శంఖ భస్మం ఒక భాగం అన్నింటిని కలిపి రోజు ఒక కప్పు వేడి నీటిలో అర చెంచా పొడిని కలిపి తీసుకుంటుంటే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
  • త్రిఫలా చూర్ణం (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల పొడి ) మరియు త్రికటు చూర్ణం (మిరియాలు, పిప్పళ్ళు, శొంటి పొడి) రెండింటి చూర్ణాలను కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకొని రోజు ఒక గ్లాసు నీటిలో అర చెంచా చూర్ణం కలిపి కషాయం లాగా కాచి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది.
  • ధనియాలు, శొంటి సమపాళ్ళలో తీసుకుని నీళ్ళలో వేసి కాచి వడగట్టి అరకప్పు చొప్పున రెండుపూటలా భోజనానికి ముందు  తీసుకుంటే గ్యాస్ తో పాటు అజీర్తి కూడా తగ్గిపోతుంది.
  • కరక్కాయ పెచ్చుల చూర్ణం, పిప్పళ్ళు, సౌవర్చ లవణం మూడు సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా పొడిచేసి అన్నింటికీ కలిపి నిల్వచేసుకుని రోజు అరచెంచా చొప్పున వేడినీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • శొంటి పొడి మరియు బెల్లం రెండు సమపాళ్ళలో కలిపి మూడు పూటలా అరచెంచా చొప్పున తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
  • కరక్కాయ పెచ్చుల చూర్ణం పటిక బెల్లం సమపాళ్ళలో కలిపి రోజూ రెండు పూటలా బోజనానికి ముందు తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


తీసుకోకూడనివి:-  టీ, కాఫీ, ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్, చిక్కుడు, ఆపిల్, ఉల్లి పాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, శనగ పిండి వంటకాలు, గ్రుడ్డు, వేరుశనగ వీటన్నింటిని చాలా వరకు తగ్గించాలి లేదా తీవ్రతను బట్టి పూర్తిగా మానెయ్యాలి.

Friday 30 January 2015

ఏరండ తైలం (ఆముదపు చెట్టు తైలం) (castor oil plant)

మోకాళ్ళ నొప్పులు:-

ఆముదపు చెట్టు వేర్లను 1 కేజీ తీసుకొని నలుగకొట్టి దానికి నాలుగు కేజీల  నీటిని పోసి పొయ్యి మీద మరగనివ్వాలి. నీరు 1 కేజీ వచ్చేంత వరకూ మరగనిచ్చి తీసి వడపోయాలి. వడపోయగా వచ్చిన కషాయానికి 1 కేజీ ఆముదం కలిపి మళ్ళీ సన్నని మంటపై మరగనివ్వాలి. ఈ కషాయం అంతా ఇగిరి 1 కేజీ అయ్యేంత వరకూ మరగనివ్వాలి. తరువాత దించి వడగట్టి చల్లార్చి పెట్టుకోవాలి. దీనిని గోరువెచ్చగా వేడిచేసి నొప్పి ఉన్నచోట మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఇలా రోజు చేయడం వలన నొప్పి శాశ్వతంగా తగ్గిపోతుంది.


ఆముదము చెట్టు

ఉత్తరేణి తైలం (LATJEERA)

ఉత్తరేణి (Latjeera) ఆకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. వాటిని మెత్తగా నూరి రసం తీసి వడగట్టి పెట్టుకోవాలి. ఇలా వడగట్టిన ఉత్తరేణి రసాన్ని ఒక కప్పు తీసుకొని ఒక కప్పు నువ్వుల నూనె కలిపి సన్నని మంటపై మరిగించాలి. రసం అంతా ఇగిరి నూనె మాత్రం మిగిలే వరకూ మరగనివ్వాలి.  ఇలా తయారైన రసాన్ని రోజూ ఉదయం స్నానానికి ఒక గంట ముందు పొట్టపై మర్దన చేయడం వలన అధిక పొట్ట తగ్గటమే కాకుండా చర్మ సంబంధ వ్యాధులు కూడా నివారించాబడతాయి.