పసుపు (Turmeric) |
మధుమేహం:- మంచి పసుపు, ఉసిరిక కాయ బెరడు చూర్ణము ఈ రెండూ సమభాగాలు కలిపి చూర్ణం చేసి రోజు 2 పూటలా 10 గ్రాములు మోతాదుగా మంచి నీళ్ళతో సేవిస్తూ వుంటే క్రమంగా మధుమేహం తగ్గుముఖం పడుతుంది.
కాలి పగుళ్ళు:- మనదరికి తెలుసు ఏ శుభకార్యం అయినా ఆడవారు కాళ్ళకు పసుపు పట్టించుకుంటుంటారు. కాళ్ళకు పసుపు పట్టించుకోవడం వలన కాళ్ళ పగుళ్ళకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. కాళ్ళను శుభ్రంగా నీటితో కడిగి పొడి బట్టతో తుడిచి పసుపు మరియు ఆముదం కలిపి పట్టించడం వల్ల కాలి పగుళ్ళు మటుమాయం అవుతాయి.
కాలి పగుళ్ళు:- మనదరికి తెలుసు ఏ శుభకార్యం అయినా ఆడవారు కాళ్ళకు పసుపు పట్టించుకుంటుంటారు. కాళ్ళకు పసుపు పట్టించుకోవడం వలన కాళ్ళ పగుళ్ళకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. కాళ్ళను శుభ్రంగా నీటితో కడిగి పొడి బట్టతో తుడిచి పసుపు మరియు ఆముదం కలిపి పట్టించడం వల్ల కాలి పగుళ్ళు మటుమాయం అవుతాయి.
నేత్ర వ్యాధులు:- పరిశుభ్రమైన పసుపు కొమ్మును నీటితో సాది ఆ గంధాన్ని పెసర బద్ధంత మోతాదుగా కలిములాగా రోజు రాత్రి పూట వాడుతూ వుంటే నేత్ర వ్యాధులు హరిస్తాయి.
గడ్డలు, గాయాలు, బెనుకులు:- పసుపు గాని, పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు, గడ్డలు, గాయాలు, బెనుకులు హరించి పోతాయి.
గడ్డలు, గాయాలు, బెనుకులు:- పసుపు గాని, పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు, గడ్డలు, గాయాలు, బెనుకులు హరించి పోతాయి.
తల రోగములు:- పసుపు కొమ్మును గంధం తీసి పైన లేపనం చేసిన లేక పైన పట్టు లాగా వేసిన దాని మీద కాపడం పెట్టిన తలదిమ్ము, తల పోట్లు, పార్శ్వపు నొప్పి, అపస్మారము శాంతిస్తాయి. పసుపు పూల రసం గాని ఆకుల రసం గాని వాడిన అదే ఫలితం కలుగుతుంది.
గోరుచుట్టు - మడమశీల:- పసుపును సున్నపు నీటిలో ఉడక బెట్టి గాని లేక నూనెలో వుడకపెట్టి కాని పైన వేసి కడుతూ వుంటే గోరు చుట్టు, మడమ శూల, జెట్టలు, గడ్డలు మొదలైనవి హరించి పోతాయి.
పురుగులకు:- పసుపు చూర్ణం నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లితే పురుగులు నశించిపోతాయి.
స్పోటకం మచ్చలు :- పసుపు, వేపాకు కలిపి ముద్దగా నూరి నూనె కలిపి వంటికి లేపనం చేస్తూ వుంటే స్పోటకం తాలుకు మచ్చలు, పుండ్లు మానిపోతాయి. ఇదే ప్రక్రియ ప్రకారం అనేక చర్మ వ్యాధులను సైతం అరికట్టవచ్చు.
దగ్గులు - పిల్లికూతలు:- వగర్పు దగ్గులు ,పిల్లి కూతలు మొదలైన శ్వాస కోశ వ్యాధులున్నవారు పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి చల్లార్చిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరించి దాని రసం మింగుతూ వుంటే దగ్గు ,పిల్లి కూతలు తగ్గుతాయి.
కనురెప్పలు రాలటం:- నిమ్మపండుకు రంధ్రం చేసి అందులో పసుపు కొమ్మును దూర్చి 3 రోజులు నానబెట్టాలి. తరువాత దాన్ని తీసి ఎండబెట్టాలి. మళ్ళీ వేరొక నిమ్మపండులో దాన్ని గుచ్చి 3 రోజులుంచి తీసి ఎండబెట్టాలి. ఇలా చేసిన తరువాత బాగా ఎండిన ఆ పసుపు కొమ్మును నిలవ చేసుకుని రోజు రాత్రి నిద్ర పోయే ముందు కొంచెం నీటితో సాది ఆ గంధాన్ని కంటికి కాటుక లాగ పెట్టు కొంటూ వుంటే కంటి రెప్పలు ఊడిపోవడం ఆగిపోతుంది.
జలుబు, ముక్కు దిబ్బడ:- జలుబు అందరికి సాధారణంగా వేధించే సమస్య. దీని నివారణకు కూడా పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. నిప్పులపై పసుపు వేసి ఆ పొగను వాసన చూసినట్లయితే జలుబుకు చక్కని ప్రయోజనం ఉంటుంది. ఈ కాలంలో నిప్పులు లభించుట కష్టం కావున వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి అయినా పట్టుకోవచ్చు.
No comments:
Post a Comment