Thursday 3 December 2015

తేనె (Honey)

Ayurvedam
 తేనె (Honey)
కంటి మసకలకు:-  1.ఎండు కర్జూరము కాయ లోపలి గింజను మంచి తేనె తో సానరాయి మీద అరగదీసి ఆ గంధాన్ని పెసర గింజంత కంట్లో పెట్టుకొంటూ వుంటే కంటి మసకలు నివారింపబడతాయి .

2. మంచి మేలు రకమైన పట్టు తేనె 4 చెంచాలు ,మంచి మేలు రకమైన పచ్చ కర్పూరము 2 చిన్న పలుకులు కలిపి మెత్తగా నూరి గాజు బరిణి లో నిలువ ఉంచుకుని ,రాత్రి పూట కండ్లలో పెసర బద్ధంత పెట్టుకొంటూ వుంటే ,కండ్లలో కొంచెం నీరు కారిపోయి, కండ్లు తేటగా చల్లగా మారి, మసకలు కంటి దురదలు కూడా తగ్గిపోతాయి.

నేత్ర బలం:- రాత్రి నిద్ర పోయే ముందు తేనె (Honey), నీరుల్లి (Onion) రసం సమంగా కలిపి 2 చుక్కలు కంట్లో వేసుకొంటూ వుంటే నేత్ర దోషాలు నివారింపబడతాయి.


జలుబు-పడిశము:- రోజు 2 లేక 3 పూటలా అవసరాన్ని బట్టి 30 గ్రాముల  తేనె 25 గ్రాముల అల్లం రసం కలిపి తాగుతూ వుంటే జలుబు ,పడిశము 2 రోజుల్లోనే హరించి పోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.మలబద్ధకం కూడా నివారింపబడుతుంది .

శరీర స్థౌల్యము (స్థూలకాయము) తగ్గుటకు:- ప్రతి రోజు ఉదయం పరగడపున 20 గ్రాముల  తేనెను రాత్రి నిలువ వున్న నీటిలో కలిపి తాగుతూ వుంటే క్రమంగా శరీర స్థౌల్యము  తగ్గిపోతుంది.

బిళ్లలకు-గడ్దలకు:-  తేనె ,సున్నము ఈ రెండు సమంగా కలిపి నూరి శరీరం మీద లేచే బిళ్లలకు గాని, గడ్దలకు గాని పట్టు లాగ వేసి పైన పలుచటి నూలుగుడ్డ అంటిస్తూ వుంటే అవి కరిగిపోతాయి.

వాంతులు:- తేనె 20 గ్రాములు, దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3 గ్రాములు  కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 నుండి 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.

స్త్రీల ఎర్రబట్టకు:-  2౦ గ్రాముల తేనె , 1౦ గ్రాముల ఉసిరికాయ బెరడు చూర్ణము  కలిపి ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే స్త్రీల ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.


కాళ్ళ పగుళ్ళకు:- తేనె మైనం 50 గ్రాములు, తీసుకుని చిన్న మంట మీద మరిగించి వడపోసి అందులో 100 గ్రాముల వెన్నపూస కలిపితే అది కూడా కరిగిపోయి, ఆ తరువాత ఆ రెండు పదార్ధాలు పేస్ట్ లాగ మారతాయి. ఆ పదార్ధాన్ని పాదాల పగుళ్ళకు లేపనం చేస్తూ వుంటే పగుళ్ళు తగ్గిపోయి పాదాలు నున్నగా అవుతాయి.

కంట్లో పువ్వులకు:- తేనె, లేత మునగాకు రసం సమభాగంగా కలిపి రోజు రాత్రి నిద్ర పోయే ముందు 2 చుక్కలు కంట్లో వేస్తూ వుంటే కంటి లోని పువ్వులు కరిగి పోతాయి.

నీరసం రోగం:- రోజు 2 పూటల అర గ్లాస్ మంచి నీళ్ళల్లో 30 గ్రాముల తేనె కలిపి తాగుతూ వుంటే నీరసం రోగం తగ్గిపోయి వంటికి మంచి బలం వస్తుంది.

మూత్రం కష్టంగా వస్తుంటే:- తేనె 15౦ గ్రాములు, మంచి మేలు జాతి పసుపు 50 గ్రాములు, కలిపి బాగా మెత్తగా నూరి నిలువ ఉంచుకుని రోజు 2 పూటల పూటకు 15 గ్రాముల మోతాదుగా సేవించి వెంటనే ఆవు పాలు తాగుతూ వుంటే మూత్రం బొట్టుబొట్టులా పడటం హరించి సాఫీగా వెలువడుతుంది.

దగ్గు:- తేనె 3 గ్రాములు, అల్లం రసం 6 గ్రాములు కలిపి ఒక మోతాదుగా, 2 పూటలా సేవిస్తూ వుంటే దగ్గు తగ్గిపోతుంది.

పిల్లల ఉదర పోటు:-  ప్రతి రోజు ఉదయం పరగడపున పావు గ్లాస్ నీళ్ళల్లో పావు చెంచా తేనె కలిపి తాగిస్తూ వుంటే పిల్లల గాలి పొట్ట కరిగిపోతుంది.

పిల్లల చిగుళ్ళ వాపు:-
పిల్లలకు దంతాలు వచ్చే ముందు చిగుళ్ళు వాస్తే నిప్పుల మీద పొంగించిన వెలిగారము ,తేనె కలిపి మెత్తగా నూరి కొద్ది పరిమాణము చిగుళ్ళ మీద పట్టిస్తూ వుంటే ఆ వాపులు తగ్గిపోతాయి.

నోటి దుర్గంధం:- పావు లీటర్ మంచి నీళ్ళల్లో 10 గ్రాములు తేనె కలిపి, ఆ నీటిలో రోజు 3 పూటలా పుక్కిలించి వూసివేస్తూ వుంటే నోటి దుర్గంధం హరించి పోయి నోరు పరిమలంగా వుంటుంది.

అంటు వ్యాధులకు:- తేనె మైనమును నిప్పుల మీద వేసి ఆ పొగను ఇంట్లో ప్రసరింపచేస్తూ వుంటే అంటూ వ్యాధులు సోకకుండా నివారింపబడతాయి. అందుకే ప్రతి రోజు చేసే యజ్ఞం లో తేనె వాడాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment