Monday 29 September 2014

ఉల్లి (ONION)

ఉల్లి


"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు"  ఇది దాదాపు తెలుగువారందరికీ తెలిసిన నానుడి. ఆయుర్వేదంలో ఉల్లిని కొన్ని వందల రోగాలకు ఉపయోగిస్తారు. అందుకే ఈ నానుడి  ఇంత ప్రాచుర్యం పొందింది. అందులోంచి మీకోసం కొన్ని.

  • చలికాలంలో తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. అటువంటివారు తేనె, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలిపి రోజూ మూడు స్ఫూన్ల చొప్పున తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
  • ఉల్లి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మొదట తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి, దంచి, దానిని వెన్నతో కలిపి వేయించుకుని ఒక స్ఫూను తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే అద్బుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
  • పైల్స్‌తో బాధపడుతున్నవారికి ఉల్లి చాలా ఉపకరిస్తుంది. మొదట  30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. 
  • చెవులొ హొరు ఉన్నవారు దూది మీద ఉల్లిరసాన్ని  పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది.
  • పంటి నొప్పి, చిగుళ్ల వాపు ఉన్నవారు  గోరువెచ్చటి నీటిలో ఉల్లిపాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. తరువాత  ఉల్లి రసాన్ని దూదితో అద్దుకొని పళ్లపై చిన్నగా మసాజ్ చేస్తే చిగుళ్ళ నొప్పులు, వాపుల నుండి విముక్తి పొందవచ్చు.


No comments:

Post a Comment