Wednesday 24 September 2014

జలుబు

జలుబు 

వర్షాకాలం వస్తే అందరికి సాధారణంగా చాలా మందికి జలుబు చేయడం సహజం.అయితే జలుబు నుండి ఉపశమనానికి ఈ క్రింద తెలిపిన చిట్కాలు పాటిస్తే మంచి ఉపసమనం ఉంటుంది.

  • రెండు కప్పుల నీటిలో కొద్దిగా జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి మరిగించి ఆ కషాయం తాగితే జలుబు నుండి త్వరగా ఉపసమనం పొందే వీలుంటుంది.
  • జలుబు చేసినవారు విధిగా వేడినీరు గాని లేదా కాచి చల్లార్చిన నీరు కాని తాగితే జలుబు నుండి త్వరగా ఉపసమనం పొందవచ్చు.
  • జలుబు బాగా ఎక్కువగా ఉండి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నీటితో ఆవిరి పట్టుకోవడం వలన చెమట పట్టి మంచి ఫలితం లభిస్తుంది. 
  • ముక్కు దిబ్బడ మరింత ఎక్కువ ఉన్నపుడు ఆవిరి పట్టే నీటిలో యూకలిప్టస్ ఆకులను గాని లేదా యూకలిప్టస్ నూనెను వాడటం వలన మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. యూకలిప్టస్ దొరకని వారు పసుపు వేడినీటిలో వేసుకొని ఆవిరి పట్టుకుంటే చాలా మంచిది.
  • పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి ఆ పొగను పీల్చుకున్నా కూడా జలుబు నుంచి త్వరితగతిన ఉపసమనం కలుగుతుంది.
  • జలుబు ఉన్నవారు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.
  • పొగడపువ్వులను ఎండబెట్టి పొడిచేసి నశ్యములా పీల్చినట్లయితే జలుబు తగ్గుముఖం పడుతుంది.

No comments:

Post a Comment