ఆయాసం
ఆయాసం ఉన్నవారు చల్లటి లేదా పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు. ఈ చల్లటి మరియు పుల్లటి పదార్థాలు తీసుకోవడం వలన కఫ మరియు వాత దోషాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. కఫం మరియు వాతం పెరగడం వలన ఆయాసం ఎక్కువవుతుంది. రోజూ ప్రాణాయామం చేయడం వలన కూడా ఊపిరితిత్తులు శ్వాస తీసుకునే సామర్థ్యం పెరిగి ఆయాసం తగ్గడానికి వీలుంటుంది.
- ఆయాసం ఉన్నవారు వామును మూకట్లో వేసి బాగా నల్లగా వేగించాలి. అలా వేగించేటప్పుడు వచ్చే పొగను పీలిస్తే ఆయాసం నుంచి ఉపసమనం కలుగుతుంది.
- శొంటిని నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. మరియు మిరియాలను వేరుగా చూర్ణం చేసుకోవాలి.వీటితోపాటు అడ్డసరపు ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసుకొని ఈ మూడింటిని సమపాళ్ళలో కలిపి పెట్టుకోవాలి. ఈ మూడింటి చూర్ణాన్ని రోజూ మూడు పూటలా మూడు గ్రాముల చొప్పున తేనెతో కలుపుకొని సేవించడం వల్ల ఆయాసం తగ్గడానికి సహాయపడుతుంది.
No comments:
Post a Comment