Monday 15 September 2014

వాము

వాము

వాము
  • వాము పలు రకాల ఉదార సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.అంతేకాకుండా వాము మౌత్ ఫ్రెషర్ గా కూడా పనిచేస్తుంది.
  • ఆయాసం ఉన్నవారు వామును మూకట్లో వేసి బాగా నల్లగా వేగించాలి. అలా వేగించేటప్పుడు వచ్చే పొగను పీలిస్తే ఆయాసం నుంచి ఉపసమనం కలుగుతుంది. ఇలా చేయడంవలన అయాసమే కాకుండా జలుబు వలన వచ్చిన ముక్కుదిబ్బడ మరియు తలనొప్పి కూడా తగ్గిపోతుంది.
  • వామును చప్పరించడం వలన ఫ్లూ లేదా దగ్గు నుండి ఉపసమనం పొందవచ్చు.
  • మైగ్రేన్ ఉన్నవారు వామును చప్పరించడం వలన మంచి ఉపసమనం కలుగుతుంది.
  • కడుపులో గ్యాస్ ఉన్నవారు వామును సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మంపై దద్దుర్లు 
వాము ,పాత బెల్లం సమబాగాలుగా దంచి ఉసిరిక కాయంత(10gm) ఉండలుగా చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక ముద్ద చొప్పున 2 పూటలా తింటూ వుంటే చర్మం పై దద్దుర్లు తగ్గి పోతాయి.
నీళ్ళ విరేచనములు
వాము అరకు అంటే వాము వాటర్ పూటకు ఒక ఔన్సు చొప్పున 2 లేక 3 పూటలా సేవిస్తూ వుంటే వెంటనే నీళ్ళ విరేచనాలు కట్టుకున్తై.విరేచనాలు ఎక్కువగా వుంటే 2 ఔన్సులు పేద వాళ్లకు ఇవ్వవచ్చు.
కడుపు నొప్పులకు
వాము వాటర్ ఒకటి లేదా 2 ఔన్సులు మోతాదుగా అవసరాన్ని బట్టి తాగితే వెంటనే కడుపు నొప్పి ,ఉబ్బరం తగ్గిపోతాయి.
కడుపులో మేలితిప్పుతూ ఉంటె
వాము , ఉప్పు సమానంగా తీసుకుని కొంచెం నీటిలో కలిపి మేతగా నూరి కుంకుడు గింజలంత టాబ్లెట్ చేసి గాలి తగిలేటట్లు ఆరబెట్టుకుని ,పూటకు ఒక టాబ్లెట్ చొప్పున వేడి నీటితో వేసుకుంటూ వుంటే అజీర్ణం ,గ్యాస్ అసిడిటీ వల్ల ,కడుపులో మెలితిప్పినట్లుగా వుండే ఉదర శూల తగ్గి పోతుంది.
ఆకలి పెరుగుటకు
వాము 10gm ,నల్ల ఉప్పు 3gm , పొంగించిన ఇంగువ 1gm కలిపి దంచి చూర్ణం చేసి నిలువ వుంచుకోవాలి.ఆకలి సరిగా లేనప్పుడు ఈ చూర్ణాన్ని 2 చిటికెల మోతాదుగా గోరువేచని 2 పూటలా సేవిస్తూ వుంటే కడుపు వికారము , కడుపు శూల ,అజీర్ణము ఇవన్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.
జలుబు-పడిశము
వాము 10gm ,బెల్లము 40 gm కలిపి దంచి ఆ ముద్దను అర లీటర్ నీటిలో కలిపి పొయ్యి మీద పెట్టి పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి వాడపోసుకుని అది గోరువెచగా అయిన తరువాత తాగాలి.వేడి శరీరం వున్నా వారు ఈ కషాయం చల్లార్చిన తరువాత చల్లగా తాగాలి .తాగిన వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోవాలి .ఈ విధంగా 2,3 రోజు లు చేస్తే ఎంత తీవ్రమైన జలుబు ,పడిశ బారమైన తగ్గిపోతాయి.
కఫా జ్వరములకు
శరీరంలో కఫము పెరిగి జలుబు , జలుబు పడిశము తో కూడిన కఫా జ్వరము కలిగినపుడు వాము 10gm తీసుకుని చిన్న మట్టి పిడతలో వేసి అందులో 2 గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి రాత్రి నుండి ఉదయం వరకు అలాగే వుంచి ఉదయం పూట వడగట్టి అందులో చిటికెడు ఉప్పు కలిపి ఆ నీటిని తాగాలి . ఇలా 2,3 రోజులు చేస్తే కఫాజ్వరము తగ్గుతుంది.
విషమ జ్వరాలకు 
వాము పొడి 6gm , పాత బెల్లం 20gm , కలిపి పూటకొక మోతాదుగా దంచి 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి .
డస్ట్ ఎలర్జీ 
వాము మెత్తగా దంచి పలుచని గుడ్డలో మూట గట్టి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని మాటిమాటికి వాసన చూస్తూ వుంటే దుమ్ము వల్ల ,తాలింపు వల్ల ,గాటు వాసన వల్ల కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది.
పిల్లల సకల వ్యాధులు
వాము ,మిరియాలు ,శొంటి ,కుక్క పొగాకు ఈ 4 ఒక్కొక్కటి 10gm ,నల్ల ఉప్పు 20gm తీసుకోవాలి .వాము మిరియాలు ,శొంటి ఈ మూటిని దోరగా వేయించి అన్ని కలిపి దంచి పెట్టుకోవాలి .ఆ పొడిలో తగినంత కుక్క పొగాకు ఆకు రసము కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.తరువాత సైంధవ లవణం 3 చిటికెలు , వాము 3 చిటికెలు ఒక గ్లాస్ నీటిలో వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేల మరిగించి వడపోసి చల్లార్చి ఈ కషాయాన్ని 2 బాగాలు చేసి , పై మాత్రను సగం కషాయం తో ఉదయం ,సగం కషాయం తో సాయంత్రం వేసుకుంటూ వుంటే శిశువుల సమస్య తగ్గి పోతుంది.
మలేరియా జ్వరమునకు
వాము 5gm ,మిరియాలు లెక్కకు 12 ,శొంటి 5 gm.ఈ మూడింటిని ఒక మట్టి పిడతలో వేసి అందులో ఒక గ్లాస్ మంచి నీటిని పోసి రాత్రి నుండి ఉదయం వరకు వరకు నిలవ వుంచి ఉదయం పూట గుడ్డ లో వడపోసి ఆ నీళ్ళు పారబోసి ,పిడత లోని పదార్ధాలను తీసుకుని , అందులో 12 తులసి ఆకులు , 3 చిటికెల నల్ల ఉప్పు కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండి పోయేలా ఆరబెట్టి నిలవ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూతల మంచి నీటితో వేసుకుంటూ వుంటే మలేరియా జ్వరం హరించి పోతుంది.

No comments:

Post a Comment