Monday, 29 September 2014

ఉల్లి (ONION)

ఉల్లి


"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు"  ఇది దాదాపు తెలుగువారందరికీ తెలిసిన నానుడి. ఆయుర్వేదంలో ఉల్లిని కొన్ని వందల రోగాలకు ఉపయోగిస్తారు. అందుకే ఈ నానుడి  ఇంత ప్రాచుర్యం పొందింది. అందులోంచి మీకోసం కొన్ని.

  • చలికాలంలో తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. అటువంటివారు తేనె, ఉల్లి రసాన్ని సమపాళ్లలో కలిపి రోజూ మూడు స్ఫూన్ల చొప్పున తీసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.
  • ఉల్లి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మొదట తెల్ల ఉల్లిని పొరలుగా చీల్చి, దంచి, దానిని వెన్నతో కలిపి వేయించుకుని ఒక స్ఫూను తేనెతో కలిపి ఖాళీ కడుపుతో ఆ మిశ్రమాన్ని రోజు క్రమం తప్పకుండా తీసుకుంటే అద్బుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
  • పైల్స్‌తో బాధపడుతున్నవారికి ఉల్లి చాలా ఉపకరిస్తుంది. మొదట  30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. 
  • చెవులొ హొరు ఉన్నవారు దూది మీద ఉల్లిరసాన్ని  పిండి ఆ దూదిని చెవిలో ఉంచుకుంటే మంచిది.
  • పంటి నొప్పి, చిగుళ్ల వాపు ఉన్నవారు  గోరువెచ్చటి నీటిలో ఉల్లిపాయ రసాన్ని కలిపి పుక్కిలిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. తరువాత  ఉల్లి రసాన్ని దూదితో అద్దుకొని పళ్లపై చిన్నగా మసాజ్ చేస్తే చిగుళ్ళ నొప్పులు, వాపుల నుండి విముక్తి పొందవచ్చు.


Wednesday, 24 September 2014

పొగడ పువ్వు

పొగడ పువ్వు

pogada / mimusops elengi


శాస్త్రీయ నామం  :    mimusops elengi
తెలుగు పేరు     :     పొగడ, వకుళ, కేసరి
సంస్కృతం        :   बकुल, सिम्हकेसर 
                            भ्रमरनाद, स्त्री-मुखमधु  
हिंदी        :    
రంగు/లు         :     తెలుపు 
English          :    Spanish Cherry 

ఔషధ గుణం     :   It is used to fix loose teeth and as a gargle. It is also used for tooth ache, chronic dycentry and constipation.

This tree with fragrant flowers is regarded as symbol of love and beauty. Krishna is said to have fascinated gopikas on the banks of Yamuna by playing flute under this Bakula tree. In Abhignyana Shaakunatalam, Kalidasa has written that these flowers even when dried in the sun, donot lose their fragrance.

జలుబు

జలుబు 

వర్షాకాలం వస్తే అందరికి సాధారణంగా చాలా మందికి జలుబు చేయడం సహజం.అయితే జలుబు నుండి ఉపశమనానికి ఈ క్రింద తెలిపిన చిట్కాలు పాటిస్తే మంచి ఉపసమనం ఉంటుంది.

  • రెండు కప్పుల నీటిలో కొద్దిగా జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి మరిగించి ఆ కషాయం తాగితే జలుబు నుండి త్వరగా ఉపసమనం పొందే వీలుంటుంది.
  • జలుబు చేసినవారు విధిగా వేడినీరు గాని లేదా కాచి చల్లార్చిన నీరు కాని తాగితే జలుబు నుండి త్వరగా ఉపసమనం పొందవచ్చు.
  • జలుబు బాగా ఎక్కువగా ఉండి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటే నీటితో ఆవిరి పట్టుకోవడం వలన చెమట పట్టి మంచి ఫలితం లభిస్తుంది. 
  • ముక్కు దిబ్బడ మరింత ఎక్కువ ఉన్నపుడు ఆవిరి పట్టే నీటిలో యూకలిప్టస్ ఆకులను గాని లేదా యూకలిప్టస్ నూనెను వాడటం వలన మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. యూకలిప్టస్ దొరకని వారు పసుపు వేడినీటిలో వేసుకొని ఆవిరి పట్టుకుంటే చాలా మంచిది.
  • పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి ఆ పొగను పీల్చుకున్నా కూడా జలుబు నుంచి త్వరితగతిన ఉపసమనం కలుగుతుంది.
  • జలుబు ఉన్నవారు మిరియాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.
  • పొగడపువ్వులను ఎండబెట్టి పొడిచేసి నశ్యములా పీల్చినట్లయితే జలుబు తగ్గుముఖం పడుతుంది.

Monday, 15 September 2014

అరికాళ్ళ మంటలు


అరికాళ్ళ మంటలు ఉన్నవాళ్ళు మద్యం అలవాటు ఉంటే తప్పనిసరి మానివేయాలి. కాఫీ, టీ అలవాటు ఉన్నవారు కూడా మానివేయడం మంచిది. అరికాళ్ళ మంటలు ఉన్నవాళ్ళు ఈ క్రింది విధానాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
1. కావలసిన పదార్థాలు:
సోంపు - 50 గ్రా.
జీలకర్ర - 50 గ్రా.
ధనియాలు - 50గ్రా.

ఈ మూడింటిని చూర్ణం చేసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు మరుగుచున్న నీటిలో వేసి ఒక పొంగు వచ్చేవరకు కాచి వడబోయాలి. వడబోసిన నీటిని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి త్రాగవలెను. ఇలా రోజు ఉదయం, రాత్రి తీసుకుంటే అరికాల్లమంటలు తగ్గిపోయే అవకాశం చాలా ఉంది.

2. ఆముదం:-  ఆముదాన్ని బాగా ఎక్కువగా తీసుకుని రోజు రాత్రి పడుకునే ముందు అరికాళ్ళకు మర్దన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

సోంపు

సోంపు



సోంపు పొడిచేసి తిన్నా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట నానబెట్టి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.

శొంటి (Dired Ginger)

శొంటి (Dried Ginger)


తెలుగు : శొంటి
ఇంగ్లీషు : డ్రైడ్ జింజర్ (Dried Ginger)
హిందీ   :  सौंठ

Ginger root (ground)
Ginger powder.JPG

Nutritional value per 100 g (3.5 oz)
Energy1,404 kJ (336 kcal)
71.62 g
Sugars3.39 g
Dietary fiber14.1 g
4.24 g
8.98 g
Vitamins
Thiamine (B1)
(4%)
0.046 mg
Riboflavin (B2)
(14%)
0.17 mg
Niacin (B3)
(64%)
9.62 mg
(10%)
0.477 mg
Vitamin B6
(48%)
0.626 mg
Folate (B9)
(3%)
13 μg
Vitamin C
(1%)
0.7 mg
Vitamin E
(0%)
0.0 mg
Trace metals
Calcium
(11%)
114 mg
Iron
(152%)
19.8 mg
Magnesium
(60%)
214 mg
Manganese
(1586%)
33.3 mg
Phosphorus
(24%)
168 mg
Potassium
(28%)
1320 mg
Sodium
(2%)
27 mg
Zinc
(38%)
3.64 mg

Ginger root (raw)
Ginger cross section.jpg
Ginger section
Nutritional value per 100 g (3.5 oz)
Energy333 kJ (80 kcal)
17.77 g
Sugars1.7 g
Dietary fiber2 g
0.75 g
1.82 g
Vitamins
Thiamine (B1)
(2%)
0.025 mg
Riboflavin (B2)
(3%)
0.034 mg
Niacin (B3)
(5%)
0.75 mg
(4%)
0.203 mg
Vitamin B6
(12%)
0.16 mg
Folate (B9)
(3%)
11 μg
Vitamin C
(6%)
5 mg
Vitamin E
(2%)
0.26 mg
Trace metals
Calcium
(2%)
16 mg
Iron
(5%)
0.6 mg
Magnesium
(12%)
43 mg
Manganese
(11%)
0.229 mg
Phosphorus
(5%)
34 mg
Potassium
(9%)
415 mg
Sodium
(1%)
13 mg
Zinc
(4%)

మిరియాలు

మిరియాలు


తెలుగు  :  మిరియాలు
ఇంగ్లీషు : పెప్పర్ (Pepper)
హిందీ   : కాలీ మిర్చి (काली मिर्च)

100 గ్రాములలో ఈ క్రింది పోషక విలువలు ఉంటాయి.
పిండిపదార్థాలు: 49 గ్రా, 
మాంసకృత్తులు: 10.5 గ్రా, 
కొవ్వు: 6.8గ్రా, 
ఖనిజాలు: ----4.4గ్రా, 
పీచు: ---------14.9 గ్రా, 
క్యాల్షియం: ----460 మిల్లీగ్రా, 
ఇనుము: ----12.4మిల్లీగ్రా, 
ఫాస్పరస్‌: ----198 మిల్లీగ్రా, 
కెరొటీన్లు: -----1080 మిల్లీగ్రా, 
మెగ్నీషియం:- 171 మిల్లీగ్రా, 
శక్తి: ----------304 కెలొరీలు

ఆయాసం

ఆయాసం


ఆయాసం ఉన్నవారు చల్లటి లేదా పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు. ఈ చల్లటి మరియు పుల్లటి పదార్థాలు తీసుకోవడం వలన కఫ మరియు వాత దోషాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. కఫం మరియు వాతం పెరగడం వలన ఆయాసం ఎక్కువవుతుంది. రోజూ ప్రాణాయామం చేయడం వలన కూడా ఊపిరితిత్తులు శ్వాస తీసుకునే సామర్థ్యం పెరిగి ఆయాసం తగ్గడానికి వీలుంటుంది.

  • ఆయాసం ఉన్నవారు వామును మూకట్లో వేసి బాగా నల్లగా వేగించాలి. అలా వేగించేటప్పుడు వచ్చే పొగను పీలిస్తే ఆయాసం నుంచి ఉపసమనం కలుగుతుంది. 
  • శొంటిని నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. మరియు మిరియాలను వేరుగా చూర్ణం చేసుకోవాలి.వీటితోపాటు అడ్డసరపు ఆకులు ఎండబెట్టి  చూర్ణం చేసుకొని ఈ మూడింటిని సమపాళ్ళలో కలిపి పెట్టుకోవాలి. ఈ మూడింటి చూర్ణాన్ని రోజూ మూడు పూటలా మూడు గ్రాముల చొప్పున తేనెతో కలుపుకొని సేవించడం వల్ల ఆయాసం తగ్గడానికి సహాయపడుతుంది.

పిప్పలి (Pippali)

పిప్పలి 




వాము

వాము

వాము
  • వాము పలు రకాల ఉదార సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.అంతేకాకుండా వాము మౌత్ ఫ్రెషర్ గా కూడా పనిచేస్తుంది.
  • ఆయాసం ఉన్నవారు వామును మూకట్లో వేసి బాగా నల్లగా వేగించాలి. అలా వేగించేటప్పుడు వచ్చే పొగను పీలిస్తే ఆయాసం నుంచి ఉపసమనం కలుగుతుంది. ఇలా చేయడంవలన అయాసమే కాకుండా జలుబు వలన వచ్చిన ముక్కుదిబ్బడ మరియు తలనొప్పి కూడా తగ్గిపోతుంది.
  • వామును చప్పరించడం వలన ఫ్లూ లేదా దగ్గు నుండి ఉపసమనం పొందవచ్చు.
  • మైగ్రేన్ ఉన్నవారు వామును చప్పరించడం వలన మంచి ఉపసమనం కలుగుతుంది.
  • కడుపులో గ్యాస్ ఉన్నవారు వామును సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మంపై దద్దుర్లు 
వాము ,పాత బెల్లం సమబాగాలుగా దంచి ఉసిరిక కాయంత(10gm) ఉండలుగా చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక ముద్ద చొప్పున 2 పూటలా తింటూ వుంటే చర్మం పై దద్దుర్లు తగ్గి పోతాయి.
నీళ్ళ విరేచనములు
వాము అరకు అంటే వాము వాటర్ పూటకు ఒక ఔన్సు చొప్పున 2 లేక 3 పూటలా సేవిస్తూ వుంటే వెంటనే నీళ్ళ విరేచనాలు కట్టుకున్తై.విరేచనాలు ఎక్కువగా వుంటే 2 ఔన్సులు పేద వాళ్లకు ఇవ్వవచ్చు.
కడుపు నొప్పులకు
వాము వాటర్ ఒకటి లేదా 2 ఔన్సులు మోతాదుగా అవసరాన్ని బట్టి తాగితే వెంటనే కడుపు నొప్పి ,ఉబ్బరం తగ్గిపోతాయి.
కడుపులో మేలితిప్పుతూ ఉంటె
వాము , ఉప్పు సమానంగా తీసుకుని కొంచెం నీటిలో కలిపి మేతగా నూరి కుంకుడు గింజలంత టాబ్లెట్ చేసి గాలి తగిలేటట్లు ఆరబెట్టుకుని ,పూటకు ఒక టాబ్లెట్ చొప్పున వేడి నీటితో వేసుకుంటూ వుంటే అజీర్ణం ,గ్యాస్ అసిడిటీ వల్ల ,కడుపులో మెలితిప్పినట్లుగా వుండే ఉదర శూల తగ్గి పోతుంది.
ఆకలి పెరుగుటకు
వాము 10gm ,నల్ల ఉప్పు 3gm , పొంగించిన ఇంగువ 1gm కలిపి దంచి చూర్ణం చేసి నిలువ వుంచుకోవాలి.ఆకలి సరిగా లేనప్పుడు ఈ చూర్ణాన్ని 2 చిటికెల మోతాదుగా గోరువేచని 2 పూటలా సేవిస్తూ వుంటే కడుపు వికారము , కడుపు శూల ,అజీర్ణము ఇవన్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.
జలుబు-పడిశము
వాము 10gm ,బెల్లము 40 gm కలిపి దంచి ఆ ముద్దను అర లీటర్ నీటిలో కలిపి పొయ్యి మీద పెట్టి పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి వాడపోసుకుని అది గోరువెచగా అయిన తరువాత తాగాలి.వేడి శరీరం వున్నా వారు ఈ కషాయం చల్లార్చిన తరువాత చల్లగా తాగాలి .తాగిన వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోవాలి .ఈ విధంగా 2,3 రోజు లు చేస్తే ఎంత తీవ్రమైన జలుబు ,పడిశ బారమైన తగ్గిపోతాయి.
కఫా జ్వరములకు
శరీరంలో కఫము పెరిగి జలుబు , జలుబు పడిశము తో కూడిన కఫా జ్వరము కలిగినపుడు వాము 10gm తీసుకుని చిన్న మట్టి పిడతలో వేసి అందులో 2 గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి రాత్రి నుండి ఉదయం వరకు అలాగే వుంచి ఉదయం పూట వడగట్టి అందులో చిటికెడు ఉప్పు కలిపి ఆ నీటిని తాగాలి . ఇలా 2,3 రోజులు చేస్తే కఫాజ్వరము తగ్గుతుంది.
విషమ జ్వరాలకు 
వాము పొడి 6gm , పాత బెల్లం 20gm , కలిపి పూటకొక మోతాదుగా దంచి 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి .
డస్ట్ ఎలర్జీ 
వాము మెత్తగా దంచి పలుచని గుడ్డలో మూట గట్టి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని మాటిమాటికి వాసన చూస్తూ వుంటే దుమ్ము వల్ల ,తాలింపు వల్ల ,గాటు వాసన వల్ల కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది.
పిల్లల సకల వ్యాధులు
వాము ,మిరియాలు ,శొంటి ,కుక్క పొగాకు ఈ 4 ఒక్కొక్కటి 10gm ,నల్ల ఉప్పు 20gm తీసుకోవాలి .వాము మిరియాలు ,శొంటి ఈ మూటిని దోరగా వేయించి అన్ని కలిపి దంచి పెట్టుకోవాలి .ఆ పొడిలో తగినంత కుక్క పొగాకు ఆకు రసము కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.తరువాత సైంధవ లవణం 3 చిటికెలు , వాము 3 చిటికెలు ఒక గ్లాస్ నీటిలో వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేల మరిగించి వడపోసి చల్లార్చి ఈ కషాయాన్ని 2 బాగాలు చేసి , పై మాత్రను సగం కషాయం తో ఉదయం ,సగం కషాయం తో సాయంత్రం వేసుకుంటూ వుంటే శిశువుల సమస్య తగ్గి పోతుంది.
మలేరియా జ్వరమునకు
వాము 5gm ,మిరియాలు లెక్కకు 12 ,శొంటి 5 gm.ఈ మూడింటిని ఒక మట్టి పిడతలో వేసి అందులో ఒక గ్లాస్ మంచి నీటిని పోసి రాత్రి నుండి ఉదయం వరకు వరకు నిలవ వుంచి ఉదయం పూట గుడ్డ లో వడపోసి ఆ నీళ్ళు పారబోసి ,పిడత లోని పదార్ధాలను తీసుకుని , అందులో 12 తులసి ఆకులు , 3 చిటికెల నల్ల ఉప్పు కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండి పోయేలా ఆరబెట్టి నిలవ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూతల మంచి నీటితో వేసుకుంటూ వుంటే మలేరియా జ్వరం హరించి పోతుంది.

Sunday, 7 September 2014

పొట్టలో కొవ్వు (Belly Fat)

పొట్టలో కొవ్వు 

పిప్పళ్ళు  



పిప్పల్లను తీసుకొని పెనంలో (బాండీలో) దోరగా వేయించి పొడి చెసుకొవాలి. ఈ పొడిని పల్చటి గుడ్డలో జల్లి పట్టి బద్ర పరచుకొవాలి. దీనిని రోజు రాత్రి పాడుకొనే ముందు మూడు చిటికెలు ఒక చెంచా తేనెతో కలుపుకుని అరచేతిలో వేసుకొని చప్పరిస్తూ తినాలి.  ఈ విధంగా రోజు చేయడం వలన పొట్టలో కొవ్వు కరగడమే కాకుండా ఆకలి కూడా బాగా వేస్తుంది.