Wednesday, 1 March 2017

పెరుగు (curd)

  • ముందుగా మనం పెరుగులోగల పోషక పదార్ధాల గురించి తెలుసుకుందాం.
    పోషకపదార్థం
    విలువలు
    నీటిశాతం89.1%
    ప్రోటీన్3.1%
    క్రొవ్వులు4%
    మినరల్స్0.8%
    కార్బొహైడ్రేట్స్3%
    కాల్షియం149 మి.గ్రా
    ఫాస్పరస్93 మి.గ్రా
    ఇనుము0.2 మి.గ్రా
    విటమిన్ - ఎ102 ఐ.యు
    విటమిన్ - సి1 మి.గ్రా

పెరుగుతో ఆరోగ్య చిట్కాలు:-

  • కడుపులో అల్సర్ ఉన్నవారికి, అసిడిటి ఉన్నవారికి, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి పెరుగు అద్భుత ఔషదంగా పనిచేస్తుంది.
  • జ్వరం ఉన్నవారు కూడా పెరుగు తీసుకోవచ్చని మన ఆయుర్వేదం చెబుతుంది.
  • ఆహారంలో పెరుగు ఎక్కువగా తినే వారికి అపెండిసైటిస్ (Apppendicitis) సమస్యే రాదు.
  • డిస్ ఎంట్రీ (బేదులు) తో బాధపడేవారికి పెరుగు చాలా మంచి ఔషధం.
  • నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పెరుగు ఒక వరం.
  • కామెర్లు వ్యాధి వచ్చిన వారు పెరుగు (మజ్జిగ) లో తేనె కలిపి తీసుకుంటే త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
  • సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు ఒక పలుచని బట్టను పెరుగులో లేదా మజ్జిగలో ముంచి చర్మంపై వ్యాధి లక్షణాలు ఉన్నచోట ఉంచితే వ్యాధి త్వరగా నయం అవుతుంది.
పెరుగుతో సౌందర్య చిట్కాలు:-
  • పెరుగు, నిమ్మరసం కలిపి ముఖం పై పూతగా పూయడం వలన  చర్మం పై ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగి చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది.
  • మొటిమలు ఉన్నవారు శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వలన మొటిమలు తగ్గిపోతాయి.
  • తలస్నానికి అరగంట ముందు తలకి పెరుగు రాసుకొని అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.
  • ఉసిరికాయ పొడిని పెరుగులో కలిపి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చుండ్రు సమస్యను నివారించవచ్చు.
  • ప్రతి రోజు ముఖానికి పెరుగు రాసుకొని 15 నిమిషాల ఆగి ముఖం కడిగేస్తే  ముఖం కాంతివంతంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.

పెరుగు వలన నష్టాలు / పెరుగు - తీసుకోవలసిన జాగ్రత్తలు:-
  • వేసవి కాలంలో పెరుగు ఎక్కువగా తీసుకోరాదు.
  • పెరుగు ప్రతి రోజు తినకూడదు.
  • సరిగా తోడుకొని పెరుగును తినడం మంచిది కాదు.
  • రాత్రి పూట పెరుగు తినకూడదు.


Wednesday, 22 February 2017

వడదెబ్బ (Sun Stroke) - గృహ చిట్కాలు


  • వేడి నీటిలో నిమ్మరసము కలిపి తీసుకుంటుంటే వడదెబ్బ నుండి ఉపసమనము పొందవచ్చు.
  • పచ్చి మామిడి ముక్కలపై ఉప్పును చల్లి తింటే కూడా వడదెబ్బ నుండి ఉపసమనము పొందవచ్చు.
  • వడదెబ్బ నుండి కోలుకోవాలంటే వడదెబ్బ తగిలిన వారి అరచేతులకు, అరకాళ్ళకు మేకపాలు మర్దన చేసిన మంచి ఫలితం ఉంటుంది.
  • నీరుల్లి పాయను మెత్తగా దంచి రసమును తీసి కణతలకు రాస్తే వడదెబ్బ నుండి ఉపసమనం పొందవచ్చు.


Constipation (మలబద్దకం )


  • మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు 2౦౦ మి.లీ. ల గోరువెచ్చని నీరు లేదా పాలలో ఒక చెంచా కరక్కాయపొడి మరియు ఒక చెంచా పటిక బెల్లం కలిపి త్రాగితే సుఖ విరేచనం జరుగుతుంది. పటిక బెల్లం లేని వారు పంచదార కలుపుకొని త్రాగవచ్చు.
  • బీన్స్, చిక్కుడు, బొబ్బర్లు, అలసందలు లాంటి పీచుపదార్థాలు తీసుకోవడం వలన సుఖ విరేచనం జరుగుతుంది.
  • ఆముదంతో గారెలు చేసుకొని గాని లేదా ఆముదాన్ని నేరుగా సేవించడం వలన సుఖవిరేచనం కలుగుతుంది.


యోగాసనాలు- నివారణ


పవనముక్తాసనం, వజ్రాసనం వేయడం వలన మలబద్ధకం తగ్గుతుంది. అనులోమ విలోమాలు, భస్త్రిక వంటివి చేయడం వలన  జీర్ణక్రియ బాగా జరిగి సుఖ విరేచానానికి సులభం అవుతుంది. ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం వలన మనం మలబద్దకం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

Tuesday, 21 February 2017

మాంసం తింటే మధుమేహం - తస్మాత్ జాగ్రత్త













మాంసం తింటే మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు పెరుగుతుందని రావిరా - ఐ-విర్జిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. వీరు మధుమేహానికి జంతుమాంసానికి గల సంబంధంపై నాలుగు సంవత్సరాలపాటు కొంతమంది ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్తితిని పరిశీలించి కూరగాయలు తినేవారికంటే మాంసాహారం తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందని తెలియజేశారు.కావున మధుమేహం ఉన్నవారు, మధుమేహం రాకుండా ఉండాలనే వారు మాంసాహారాన్ని వదిలి కాయగూరలు ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమం.

సేకరణ ఈనాడు దినపత్రిక - 21-02-2017.