- మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు 2౦౦ మి.లీ. ల గోరువెచ్చని నీరు లేదా పాలలో ఒక చెంచా కరక్కాయపొడి మరియు ఒక చెంచా పటిక బెల్లం కలిపి త్రాగితే సుఖ విరేచనం జరుగుతుంది. పటిక బెల్లం లేని వారు పంచదార కలుపుకొని త్రాగవచ్చు.
- బీన్స్, చిక్కుడు, బొబ్బర్లు, అలసందలు లాంటి పీచుపదార్థాలు తీసుకోవడం వలన సుఖ విరేచనం జరుగుతుంది.
- ఆముదంతో గారెలు చేసుకొని గాని లేదా ఆముదాన్ని నేరుగా సేవించడం వలన సుఖవిరేచనం కలుగుతుంది.
యోగాసనాలు- నివారణ
పవనముక్తాసనం, వజ్రాసనం వేయడం వలన మలబద్ధకం తగ్గుతుంది. అనులోమ విలోమాలు, భస్త్రిక వంటివి చేయడం వలన జీర్ణక్రియ బాగా జరిగి సుఖ విరేచానానికి సులభం అవుతుంది. ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం వలన మనం మలబద్దకం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
No comments:
Post a Comment