Wednesday, 22 February 2017

వడదెబ్బ (Sun Stroke) - గృహ చిట్కాలు


  • వేడి నీటిలో నిమ్మరసము కలిపి తీసుకుంటుంటే వడదెబ్బ నుండి ఉపసమనము పొందవచ్చు.
  • పచ్చి మామిడి ముక్కలపై ఉప్పును చల్లి తింటే కూడా వడదెబ్బ నుండి ఉపసమనము పొందవచ్చు.
  • వడదెబ్బ నుండి కోలుకోవాలంటే వడదెబ్బ తగిలిన వారి అరచేతులకు, అరకాళ్ళకు మేకపాలు మర్దన చేసిన మంచి ఫలితం ఉంటుంది.
  • నీరుల్లి పాయను మెత్తగా దంచి రసమును తీసి కణతలకు రాస్తే వడదెబ్బ నుండి ఉపసమనం పొందవచ్చు.


Constipation (మలబద్దకం )


  • మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు 2౦౦ మి.లీ. ల గోరువెచ్చని నీరు లేదా పాలలో ఒక చెంచా కరక్కాయపొడి మరియు ఒక చెంచా పటిక బెల్లం కలిపి త్రాగితే సుఖ విరేచనం జరుగుతుంది. పటిక బెల్లం లేని వారు పంచదార కలుపుకొని త్రాగవచ్చు.
  • బీన్స్, చిక్కుడు, బొబ్బర్లు, అలసందలు లాంటి పీచుపదార్థాలు తీసుకోవడం వలన సుఖ విరేచనం జరుగుతుంది.
  • ఆముదంతో గారెలు చేసుకొని గాని లేదా ఆముదాన్ని నేరుగా సేవించడం వలన సుఖవిరేచనం కలుగుతుంది.


యోగాసనాలు- నివారణ


పవనముక్తాసనం, వజ్రాసనం వేయడం వలన మలబద్ధకం తగ్గుతుంది. అనులోమ విలోమాలు, భస్త్రిక వంటివి చేయడం వలన  జీర్ణక్రియ బాగా జరిగి సుఖ విరేచానానికి సులభం అవుతుంది. ఒత్తిడిని కూడా తగ్గించుకోవడం వలన మనం మలబద్దకం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

Tuesday, 21 February 2017

మాంసం తింటే మధుమేహం - తస్మాత్ జాగ్రత్త













మాంసం తింటే మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు పెరుగుతుందని రావిరా - ఐ-విర్జిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. వీరు మధుమేహానికి జంతుమాంసానికి గల సంబంధంపై నాలుగు సంవత్సరాలపాటు కొంతమంది ఆహార అలవాట్లు, ఆరోగ్య పరిస్తితిని పరిశీలించి కూరగాయలు తినేవారికంటే మాంసాహారం తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందని తెలియజేశారు.కావున మధుమేహం ఉన్నవారు, మధుమేహం రాకుండా ఉండాలనే వారు మాంసాహారాన్ని వదిలి కాయగూరలు ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమం.

సేకరణ ఈనాడు దినపత్రిక - 21-02-2017.