- కొబ్బరినూనెలో పసుపు కొమ్మును అరగదీసి వచ్చిన గంధాన్ని పుల్ల మీద రాయాలి.
- హారతి కర్పూరాన్ని, కొబ్బరి నూనెలో కలిపి పుల్లమీద రాస్తూ ఉండాలి.
- ఉప్పునీటిలో పలుచటి గుడ్డను తడిపి దాన్ని పుల్లమీద కట్టుకట్టాలి. ఆరిన తరువాత అదే ఉప్పునీటిలో గుడ్డను తడుపుడూ ఉండాలి .
Sunday, 8 February 2015
కురుపులు
ఉబ్బసం
- రోజూ మూడు మారేడు ఆకులను రెండు పూటలా నమిలి మింగుతూ ఉండాలి.
- కేబేజీ రసం లేదా ముల్లంగి రసం పూటకు ఒక ఔన్సు చొప్పున తాగుతూ ఉంటే ఉబ్బసం తగ్గిపోతుంది.
- దగ్గు ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడినీటిలో చెంచా తేనె కలుపుకొని తాగితే వెంటనే ఉపసమనం కలుగుతుంది.
Friday, 6 February 2015
ఆనె కాయలు లేదా ఆనెలు (Corns)
- రాత్రి పడుకునే ముందు ఒక నూలు బట్టను తడిపి ఆనె కాయల మీద ఉంచితే అది మెత్తబడి తగ్గిపోతాయి
- రాత్రి పడుకునే ముందు ఆవాలు, వెల్లుల్లి సమపాళ్ళలో తీసుకుని నూరి ఆనె కాయల మీద రాస్తుంటే ఆనె కాయలు మెత్తబడి తగ్గిపోతాయి .
- జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రోజూ ఆనె కాయలపై రుద్దుతూ ఉంటే ఆనె కాయలు తగ్గుతాయి.
- ఆముదాన్ని గోరువెచ్చగా కాచి దానిని ఆనెల మీద మరియు అరికాలు మొత్తం మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటిలో ఉంచాలి. ఇలా రోజూ చేయడం ద్వారా ఆనెలు తగ్గడానికి ఆస్కారం ఉంది.
- అతిమధురం ఒక చెంచా, నువ్వుల నూనె ఒక చెంచా, ఆముదం ఒక చెంచా మూడింటిని కలిపి పేస్టు లాగా చేసి ఆనెలపై పట్టిస్తూ ఉంటె ఆనెలు క్రమంగా తగ్గుతాయి.
Labels:
Corns,
ఆనె కాయలు,
ఆనెలు,
ఆముదం,
ఆవాలు,
జిల్లేడు పాలు,
వెల్లుల్లి
అజీర్తి
- అజీర్తి ఉన్నవారు రోజు ఉదయాన్నే రెండు చెంచాల అల్లపు రసం తీసుకుంటూ దీనితో పాటు లేత తులసి ఆకులు కొన్ని తీసుకుంటుంటే అజీర్తి నుండి ఉపసమనం కలుగుతుంది .
- అజీర్తి నివారణ కోసం వేరుశనగ, తేనె, ద్రాక్ష, ఖర్జూరము, బూడిద గుమ్మడి లలో దేనినో ఒకదానిని తీసుకుంటున్నా అజీర్తి తగ్గిపోతుంది .
ఉబ్బురోగం
- జీలకర్రను నీటిలో తడిపి, తర్వాత దాన్ని నూరి రసం తీసి ప్రతి 8 గంటలకోసారి తాగితే తగ్గిపోతుంది.
- ప్రతిరోజూ ఉదయం పచ్చి కాకరకాయ రసాన్ని ఒక కప్పు తాగుతూ వున్దాలి. దీనితోపాటు ప్రతి ఆరు గంటలకో సారి కొన్ని వెల్లుల్లి రేకులను నమిలి మింగితే తగ్గిపోతుంది .
Tuesday, 3 February 2015
కఫము
- దానిమ్మ లేత ఆకులను మూడు పూటలా నమిలి మింగడం వల్ల ఖఫము తగ్గిపోతుంది.
- ప్రతి ఆరు గంటలకు ఒక సారి కేబీజి ఆకు రసాన్ని గాని లేదా బచ్చలి ఆకు రసాన్ని గాని రెండు స్పూన్ల చొప్పున తీసుకొని దానితో పాటు ఒక ఉసిరికాయ తీసుకోవడం వలన ఖఫము తగ్గుతుంది.
జలుబు
- వెల్లుల్లిని బాగా నలగగొట్టి గంటకోసారి బాగా వాసన పీలుస్తూ, అరగంటకు ఒక సారి కొన్ని వెల్లుల్లి రెబ్బలను నమిలి మింగడం వలన జలుగు తగ్గుతుంది.
- ఒక గ్లాసు బార్లీ నీళ్ళలో నిమ్మరసాన్ని కాస్త ఎక్కువగా పిండుకొని ఆరు గంటలకు ఒక సారి త్రాగితే గుండెల్లో మంట మరియు జలుబు తగ్గుతాయి.
ఎక్కిళ్ళు
- శొంఠి లేదా కరక్కాయ పై పెచ్చు తీసివేసి పొడిచేసుకొని ఒక చెంచా తేనెలో కలిపి తీసుకొంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
- కొబ్బరిని బాగా దంచి పాలు పిండి త్రాగినా లేదా నిమ్మ బద్దను నిదానంగా చప్పరిస్తున్నా ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.
Sunday, 1 February 2015
కడుపు ఉబ్బరం
- అల్లపురసం లేదా శొంటి కషాయం ప్రతిపూట ఒక చెంచా తీసుకోవడం వలన కడుపులో ఉబ్బరం తగ్గిపోతుంది.
- ఒక కప్పు వేడినీటిలో రెండు చెంచాల వెల్లుల్లి రసాన్ని కలిపి తాగినా ఫలితం కనిపిస్తుంది.
కడుపులో పుండు
- పూటకోసారి వెల్లుల్లిపాయ రసం, ఆగాకర కాయ రసాన్ని ఒక కప్పు వేడినీటిలో కలిపి తీసుకోవడం వలన కడుపులో పుండు తగ్గిపోతుంది.
- ముల్లంగి రసం లేదా కొబ్బరిపాలు పూటకో కప్పు త్రాగటం వల్లకడుపులో పుండు తగ్గిపోతుంది. కర్బూజా పండు తినడం వల్ల కూడా కడుపులో పుండు తగ్గిపోతుంది.
- పూటకోసారి ఒక చెంచా అల్లపురాసాన్ని ఒక కప్పు వేడినీటిలో కలుపుకొని తీసుకోవాలి.
కడుపులో మంట
- కర్బూజా పండు లేదా పుచ్చకాయ తింటే కడుపులో మంట తగ్గుతుంది.
- ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే రెండు చెంచాల అల్లపు రసం లేదా శొంఠీ కషాయం తాగితే కడుపులో మంట తగ్గిపోతుంది.
కడుపు నొప్పి (Stomach Pain)
- ఒక అర చెంచా జీలకర్ర లేదా వాము బాగా నమిలి మింగితే కాసేపటికి కడుపు నొప్పి తగ్గిపోతుంది.
- పెసర గింజంత ఇంగువ మింగినా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
- ఒక కప్పు వేడినీటిలో టీ స్పూన్ తేనెను కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గిపోతుంది.
- విరిగిన పాలలోని నీటిని ఒక కప్పు తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది.
- నీరుల్లిపాయ ఒకటి తిన్నా కడుపు నొప్పి తగ్గిపోతుంది.
Subscribe to:
Posts (Atom)