పెదాల ఆరోగ్యం - అందం
- నీటిని ఎక్కువగా త్రాగడం వలన శరీరంలోని తేమశాతం తగ్గిపోకుండా ఉండి పెదవులు ఎండి పోకుండా, మృదువుగా ఉంటాయి.
- పెదాలు అందంగా ఆరోగ్యంగా మంచి రంగులో ఉండాలంటే మొదట గులాబి రేకులను మెత్తగా నూరి అందులో మంజిస్ట పొడి వేసి పాలతో కలిపి పెదాలకు రాసుకుంటే పెదాలు మంచి రంగు రావడమే కాకుండా మృదువుగా, అందంగా ఉంటాయి.
- గులాబి రేకులను ముద్దగా నూరి ఉంచుకోవాలి. తరువాత 20 గ్రాముల మాను పసుపు తీసుకొని మెత్తటి చూర్ణం చేసి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత 10 గ్రాముల మంజిస్ట పొడి చేసుకొని పెట్టుకోవాలి. చివరగా మనము తేనె మైనం తీసుకొని ముక్కలుగా చేసి ఒక చెంచా తీసుకొని వేడిచేసి కరిగించి అందులో పైన తెలిపిన గులాబి రేకుల పేస్టు, మానె పసుపు చూర్ణం మరియు మంజిస్ట పొడిని కలిపి బామ్ లాగా తయారు చేసుకోవాలి. దానికి పాడుకొనే ముందు పెదవులకు లిప్ బామ్ లాగా రాసుకొని ఉదయాన్నే కడుక్కోవాలి. పగటిపూట రాసుకుంటే 20 లేదా 30 నిమిషాల తరువాత కడుక్కోవచ్చు. ఇలా చేయడం వలన పెదవులు మృదువుగా, తేజస్సుతో, అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. తేనె మైనం తేమను ఆవిరి కాకుండా పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment