- ముందుగా మనం పెరుగులోగల పోషక పదార్ధాల గురించి తెలుసుకుందాం.
పోషకపదార్థం
|
విలువలు
|
నీటిశాతం | 89.1% |
ప్రోటీన్ | 3.1% |
క్రొవ్వులు | 4% |
మినరల్స్ | 0.8% |
కార్బొహైడ్రేట్స్ | 3% |
కాల్షియం | 149 మి.గ్రా |
ఫాస్పరస్ | 93 మి.గ్రా |
ఇనుము | 0.2 మి.గ్రా |
విటమిన్ - ఎ | 102 ఐ.యు |
విటమిన్ - సి | 1 మి.గ్రా |
పెరుగుతో ఆరోగ్య చిట్కాలు:-
- కడుపులో అల్సర్ ఉన్నవారికి, అసిడిటి ఉన్నవారికి, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి పెరుగు అద్భుత ఔషదంగా పనిచేస్తుంది.
- జ్వరం ఉన్నవారు కూడా పెరుగు తీసుకోవచ్చని మన ఆయుర్వేదం చెబుతుంది.
- ఆహారంలో పెరుగు ఎక్కువగా తినే వారికి అపెండిసైటిస్ (Apppendicitis) సమస్యే రాదు.
- డిస్ ఎంట్రీ (బేదులు) తో బాధపడేవారికి పెరుగు చాలా మంచి ఔషధం.
- నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పెరుగు ఒక వరం.
- కామెర్లు వ్యాధి వచ్చిన వారు పెరుగు (మజ్జిగ) లో తేనె కలిపి తీసుకుంటే త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
- సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు ఒక పలుచని బట్టను పెరుగులో లేదా మజ్జిగలో ముంచి చర్మంపై వ్యాధి లక్షణాలు ఉన్నచోట ఉంచితే వ్యాధి త్వరగా నయం అవుతుంది.
పెరుగుతో సౌందర్య చిట్కాలు:-
- పెరుగు, నిమ్మరసం కలిపి ముఖం పై పూతగా పూయడం వలన చర్మం పై ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగి చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది.
- మొటిమలు ఉన్నవారు శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వలన మొటిమలు తగ్గిపోతాయి.
- తలస్నానికి అరగంట ముందు తలకి పెరుగు రాసుకొని అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.
- ఉసిరికాయ పొడిని పెరుగులో కలిపి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చుండ్రు సమస్యను నివారించవచ్చు.
- ప్రతి రోజు ముఖానికి పెరుగు రాసుకొని 15 నిమిషాల ఆగి ముఖం కడిగేస్తే ముఖం కాంతివంతంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.
పెరుగు వలన నష్టాలు / పెరుగు - తీసుకోవలసిన జాగ్రత్తలు:-
- వేసవి కాలంలో పెరుగు ఎక్కువగా తీసుకోరాదు.
- పెరుగు ప్రతి రోజు తినకూడదు.
- సరిగా తోడుకొని పెరుగును తినడం మంచిది కాదు.
- రాత్రి పూట పెరుగు తినకూడదు.