Thursday 2 October 2014

పెదాల ఆరోగ్యం - అందం




  • నీటిని ఎక్కువగా త్రాగడం వలన శరీరంలోని తేమశాతం తగ్గిపోకుండా ఉండి పెదవులు ఎండి పోకుండా, మృదువుగా  ఉంటాయి.
  • పెదాలు అందంగా ఆరోగ్యంగా మంచి రంగులో ఉండాలంటే మొదట గులాబి రేకులను మెత్తగా నూరి అందులో మంజిస్ట పొడి వేసి పాలతో కలిపి పెదాలకు రాసుకుంటే పెదాలు మంచి రంగు రావడమే కాకుండా మృదువుగా, అందంగా ఉంటాయి.
  • గులాబి రేకులను ముద్దగా నూరి ఉంచుకోవాలి. తరువాత 20 గ్రాముల మాను పసుపు తీసుకొని మెత్తటి చూర్ణం చేసి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత 10 గ్రాముల  మంజిస్ట పొడి చేసుకొని పెట్టుకోవాలి. చివరగా మనము తేనె మైనం తీసుకొని ముక్కలుగా చేసి ఒక చెంచా తీసుకొని వేడిచేసి కరిగించి అందులో పైన తెలిపిన గులాబి రేకుల పేస్టు, మానె పసుపు చూర్ణం మరియు మంజిస్ట పొడిని కలిపి బామ్ లాగా తయారు చేసుకోవాలి. దానికి పాడుకొనే ముందు పెదవులకు లిప్ బామ్ లాగా రాసుకొని ఉదయాన్నే కడుక్కోవాలి. పగటిపూట రాసుకుంటే 20 లేదా 30 నిమిషాల తరువాత కడుక్కోవచ్చు. ఇలా చేయడం వలన పెదవులు మృదువుగా, తేజస్సుతో, అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాయి. తేనె మైనం తేమను ఆవిరి  కాకుండా పట్టి ఉంచడానికి ఉపయోగపడుతుంది.

పంటి నొప్పి (Teeth Pain)


  • పంటినొప్పి ఉన్నవారు ఒక గ్లాసు వెతినీతిలో ఒక చెంచా ఉప్పును కలిపి, ఆ నీటిలో పుక్కిలించినట్లయితే పంటి నొప్పి తగ్గడమే కాకుండా వాపు కూడా తగ్గిపోతుంది. ఈ ఉప్పునీరు ఒక సహజమైన మౌత్ వాష్ గా పనిచేసి బ్యాక్తీరియాపై దాడిచేసి నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
  • మొదట మిరియాలను మెత్తగా నూరి దానికి కొన్ని నీళ్ళు చేర్చి పేస్టులా  తయారు చేసుకోవాలి. ఈ పేస్టుని కొద్దిగా తీసుకొని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పిని తగ్గిస్తుంది.
  • లవంగాల్ని మెత్తగా నూరి దానిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని నొప్పి ఉన్న పంటి దగ్గర ఉంచితే నొప్పి తగ్గిపోతుంది. మనం లవంగాల బదులుగా లవంగాల నూనె తీసుకొని దానిని దూదికి అడ్డుకొని ఆ దూదిని నొప్పిఉన్న పంటి దగ్గర ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది.
  • కొంచెం దూదిని తీసుకొని దానిని మొదట నీటిలో తడిపి తరువాత బేకింగ్ సోడాలో ముంచి నొప్పి ఉన్న పంటిపైన ఉంచితే నొప్పి తగ్గిపోతుంది.