వేప
- చర్మవ్యాధులు:- వేపనూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పై పూత మందుగా కుష్టువ్యాధిలో ఎక్కువగా వాడుతారు.
- ఎండించిన వేపపండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు.
- అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయంపూట నీటితో సేవిస్తూ పై పూత మందుగా వేపపప్పును రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకూ మాడ్చి సల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి.
- ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాలకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగితూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వైరస్ వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకో దగిన దివ్యౌష ధమిది.
- కాడలను తొల గించిన తాజా వేప పువ్వులను వెడ ల్పాటి పాత్రలో వేసి తగి నంత పంచదార లేదా పటికబెల్లం వేసి బాగా కలిపి ఒక గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో ఒక నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవు తుంది. వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం, ముక్కులోనుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయి నట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి.
- పొంగించిన పటిక ఒక భాగం, వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది.
- వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి.
- వేపాకు బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్ అనే చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుంది.
- కొంతమందికి చర్మం కింద చెమట పొక్కులు లాగా చిన్నచిన్న ఎర్రని రంగు కలిగిన బిందువులు కనిపిస్తూ ఉంటాయి. కేశ సాదృశ్యమైన రక్తనాళాల నుండి రక్తం తప్పించుకొని చర్మం కింద చేరి బిందువుల రూపంలో వెలుపలికి కనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి చర్మం కింద రక్తనాళాలు అక్కడక్కడా ఉబ్బిపోయి వెలుపల నుండి రక్తపు ముద్దలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో వేపచెక్క లేపనం అద్భుతంగా పనిచేస్తుంది. తాజా వేపచెక్క పేళ్లను గ్రహించి నీళ్లు చిలకరిస్తూ మెత్తగా ముద్దగా నూరండి. లేదా వేపచెక్కను సానరాయి మీద నీళ్లు చిలకరిస్తూ గంధం మాదిరిగా అరగదీయండి. దీనిని ఒక అంగుళం మందాన రక్తపు బిందువులు కనిపిస్తున్న భాగం మీద లేపనం లాగా పూయండి. ఇలా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే రక్తపు పొక్కులు, రక్తార్భుదం, ఇతర రక్తపు గడ్డల సమస్యలు తగ్గుతాయి.
- ముక్కు నుండి రక్తస్రావం:- అధిక రక్తపుపోటు వల్ల గాని, జలుబు వల్ల గాని లేదా శరీర తత్వం వల్ల గాని ముక్కుదూలం అదిరి ముక్కు నుండి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ సమస్య అప్పుడప్పుడు కనిపిస్తే, మరికొంతమందిలో చీటికిమాటికి కనిపిస్తూ భయపెడుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాడుకోదగిన మంచి ఔషధ చికిత్స ఇది. తాజా వేపాకులను, వామును సమపాళ్లలో గ్రహించి మెత్తని ముద్దగా నూరండి. దీనిని రెండు చెవి తిమ్మెల మీద పైపూత లేపనంగా పూసుకోండి. దీనితో ముక్కు నుండి జరిగే రక్తస్రావం ఆశ్చర్యకరంగా ఆగుతుంది.
No comments:
Post a Comment