|
TULASI |
- తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.
- తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో
ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా,
డెంగ్యూ
జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి
తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి
ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో
చక్కెర,
పాలు కలిపి
తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని
రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
- పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్,
ఆస్థమాల్లో
కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల
జలుబు, ఫ్లూ
నుంచి ఉపశమనం లభిస్తుంది.
- తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
- చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా,
వాంతులు
వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
- ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు
నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
- ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను
దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్
టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల
అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2
inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న
యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్). ఇంకా ఇతర
అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక
డయాబెటిస్
(చక్కెర
వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.
- రక్తంలో కోలెస్టరాల్ను
తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా
పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.
- 'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి
ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి. అలాగే కంటి
శుక్లాల సమస్యకు కూడా.
వేప
- చర్మవ్యాధులు:- వేపనూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని
వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ
చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద
ఔషధాన్ని పై పూత మందుగా కుష్టువ్యాధిలో ఎక్కువగా వాడుతారు.
- ఎండించిన
వేపపండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా
వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు
పొందవచ్చు.
- అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయంపూట నీటితో సేవిస్తూ పై
పూత మందుగా వేపపప్పును రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకూ
మాడ్చి సల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం
చేస్తుంటే మొలలు తగ్గుతాయి.
- ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాలకులు, 5
మిరియాలు కలిపి నమిలి మింగితూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు
రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వైరస్
వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకో దగిన దివ్యౌష ధమిది.
- కాడలను తొల
గించిన తాజా వేప పువ్వులను వెడ ల్పాటి పాత్రలో వేసి తగి నంత పంచదార లేదా
పటికబెల్లం వేసి బాగా కలిపి ఒక గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో ఒక నెలపాటు
ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవు తుంది. వేపగుల్కందుగా పేర్కొనే ఈ
ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం
వచ్చినట్లు ఉండటం, ముక్కులోనుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు
ఎండిపోయి నట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి.
- పొంగించిన పటిక ఒక భాగం,
వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని
మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట
తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది.
- వేపాకు
బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి.
- వేపాకు బూడిదను
నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్ అనే చర్మవ్యాధిలో సుగుణం
కనిపిస్తుంది.
- కొంతమందికి చర్మం కింద చెమట పొక్కులు లాగా చిన్నచిన్న ఎర్రని రంగు కలిగిన బిందువులు కనిపిస్తూ ఉంటాయి. కేశ సాదృశ్యమైన రక్తనాళాల నుండి రక్తం తప్పించుకొని చర్మం కింద చేరి బిందువుల రూపంలో వెలుపలికి కనిపిస్తూ ఉంటుంది. మరి కొంతమందికి చర్మం కింద రక్తనాళాలు అక్కడక్కడా ఉబ్బిపోయి వెలుపల నుండి రక్తపు ముద్దలాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో వేపచెక్క లేపనం అద్భుతంగా పనిచేస్తుంది. తాజా వేపచెక్క పేళ్లను గ్రహించి నీళ్లు చిలకరిస్తూ మెత్తగా ముద్దగా నూరండి. లేదా వేపచెక్కను సానరాయి మీద నీళ్లు చిలకరిస్తూ గంధం మాదిరిగా అరగదీయండి. దీనిని ఒక అంగుళం మందాన రక్తపు బిందువులు కనిపిస్తున్న భాగం మీద లేపనం లాగా పూయండి. ఇలా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే రక్తపు పొక్కులు, రక్తార్భుదం, ఇతర రక్తపు గడ్డల సమస్యలు తగ్గుతాయి.
- ముక్కు నుండి రక్తస్రావం:- అధిక రక్తపుపోటు వల్ల గాని, జలుబు వల్ల గాని లేదా శరీర తత్వం వల్ల గాని ముక్కుదూలం అదిరి ముక్కు నుండి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ సమస్య అప్పుడప్పుడు కనిపిస్తే, మరికొంతమందిలో చీటికిమాటికి కనిపిస్తూ భయపెడుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాడుకోదగిన మంచి ఔషధ చికిత్స ఇది. తాజా వేపాకులను, వామును సమపాళ్లలో గ్రహించి మెత్తని ముద్దగా నూరండి. దీనిని రెండు చెవి తిమ్మెల మీద పైపూత లేపనంగా పూసుకోండి. దీనితో ముక్కు నుండి జరిగే రక్తస్రావం ఆశ్చర్యకరంగా ఆగుతుంది.