- కలబంద గుజ్జు కొబ్బరి నూనె ఆముదం సమాన పాళ్లలో తీసుకుని దానికి కొంచెం మెంతులు కలిపి మరిగించాలి. ఇది బాగా వేడయ్యాక చల్లార్చి ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. దీనిని తలస్నానానికి ముందు తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన వెంట్రుకలు మృదువుగా మెరుస్తూ ఉంటాయి.
- ముఖంపై మచ్చలు ఉన్నవారు తగ్గాలంటే పావుకప్పు కలబంద గుజ్జు తీసుకొని దానికి కొద్దిగా తేనె కలుపుకొని దాన్ని రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట ఉంచి కడిగేసి నిద్ర పోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గిపోయే అవకాశం ఉంది.
AYURVEDAM | ఆయుర్వేదం
A COMPLETE INFORMATION ON AYURVEDAM
Monday, 7 October 2019
కలబంద - ALOEVERA
Wednesday, 1 March 2017
పెరుగు (curd)
- ముందుగా మనం పెరుగులోగల పోషక పదార్ధాల గురించి తెలుసుకుందాం.
పోషకపదార్థం
విలువలు
నీటిశాతం 89.1%
ప్రోటీన్ 3.1%
క్రొవ్వులు 4%
మినరల్స్ 0.8%
కార్బొహైడ్రేట్స్ 3%
కాల్షియం 149 మి.గ్రా
ఫాస్పరస్ 93 మి.గ్రా
ఇనుము 0.2 మి.గ్రా
విటమిన్ - ఎ 102 ఐ.యు
విటమిన్ - సి 1 మి.గ్రా
పెరుగుతో ఆరోగ్య చిట్కాలు:-
- కడుపులో అల్సర్ ఉన్నవారికి, అసిడిటి ఉన్నవారికి, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారికి పెరుగు అద్భుత ఔషదంగా పనిచేస్తుంది.
- జ్వరం ఉన్నవారు కూడా పెరుగు తీసుకోవచ్చని మన ఆయుర్వేదం చెబుతుంది.
- ఆహారంలో పెరుగు ఎక్కువగా తినే వారికి అపెండిసైటిస్ (Apppendicitis) సమస్యే రాదు.
- డిస్ ఎంట్రీ (బేదులు) తో బాధపడేవారికి పెరుగు చాలా మంచి ఔషధం.
- నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పెరుగు ఒక వరం.
- కామెర్లు వ్యాధి వచ్చిన వారు పెరుగు (మజ్జిగ) లో తేనె కలిపి తీసుకుంటే త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
- సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు ఉన్నవారు ఒక పలుచని బట్టను పెరుగులో లేదా మజ్జిగలో ముంచి చర్మంపై వ్యాధి లక్షణాలు ఉన్నచోట ఉంచితే వ్యాధి త్వరగా నయం అవుతుంది.
పెరుగుతో సౌందర్య చిట్కాలు:-
- పెరుగు, నిమ్మరసం కలిపి ముఖం పై పూతగా పూయడం వలన చర్మం పై ఉండే మలినాలు తొలగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగి చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది.
- మొటిమలు ఉన్నవారు శనగపిండిలో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవడం వలన మొటిమలు తగ్గిపోతాయి.
- తలస్నానికి అరగంట ముందు తలకి పెరుగు రాసుకొని అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.
- ఉసిరికాయ పొడిని పెరుగులో కలిపి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే చుండ్రు సమస్యను నివారించవచ్చు.
- ప్రతి రోజు ముఖానికి పెరుగు రాసుకొని 15 నిమిషాల ఆగి ముఖం కడిగేస్తే ముఖం కాంతివంతంగా, మృదువుగా, అందంగా తయారవుతుంది.
నీటిశాతం | 89.1% |
ప్రోటీన్ | 3.1% |
క్రొవ్వులు | 4% |
మినరల్స్ | 0.8% |
కార్బొహైడ్రేట్స్ | 3% |
కాల్షియం | 149 మి.గ్రా |
ఫాస్పరస్ | 93 మి.గ్రా |
ఇనుము | 0.2 మి.గ్రా |
విటమిన్ - ఎ | 102 ఐ.యు |
విటమిన్ - సి | 1 మి.గ్రా |
పెరుగు వలన నష్టాలు / పెరుగు - తీసుకోవలసిన జాగ్రత్తలు:-
- వేసవి కాలంలో పెరుగు ఎక్కువగా తీసుకోరాదు.
- పెరుగు ప్రతి రోజు తినకూడదు.
- సరిగా తోడుకొని పెరుగును తినడం మంచిది కాదు.
- రాత్రి పూట పెరుగు తినకూడదు.
Labels:
butter milk,
Curd,
lassi,
yogurt,
అల్సర్,
కామెర్లు,
పెరుగు,
బేదులు,
మజ్జిగ,
లస్సి,
సోరియాసిస్
Subscribe to:
Posts (Atom)