Monday, 7 October 2019

కలబంద - ALOEVERA



  • కలబంద గుజ్జు కొబ్బరి నూనె ఆముదం సమాన పాళ్లలో తీసుకుని దానికి కొంచెం మెంతులు కలిపి మరిగించాలి.  ఇది బాగా వేడయ్యాక చల్లార్చి ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి.  దీనిని తలస్నానానికి ముందు తలకు పట్టించి మర్దనా చేయాలి.  ఇలా చేయడం వలన వెంట్రుకలు మృదువుగా మెరుస్తూ ఉంటాయి. 
  • ముఖంపై మచ్చలు ఉన్నవారు తగ్గాలంటే పావుకప్పు కలబంద గుజ్జు తీసుకొని దానికి కొద్దిగా తేనె కలుపుకొని దాన్ని రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని పావుగంట ఉంచి కడిగేసి నిద్ర పోవాలి.  ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గిపోయే అవకాశం ఉంది.